Coconut Lassi : పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. పెరుగులో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పెరుగును నేరుగా తినడంతో పాటు దీనితో మనం లస్సీని కూడా తయారు చేస్తూ ఉంటాం. వేసవి కాలంలో ఈ లస్సీని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. లస్సీ చల్ల చల్లగా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనం మన రుచికి తగినట్టు రకరకాల రుచుల్లో ఈ లస్సీని తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా చేసుకోదగిన లస్సీ వెరైటీలలో కొకోనట్ లస్సీ కూడా ఒకటి. కొబ్బరి నీళ్లు, కొబ్బరి వేసి చేసే ఈ లస్సీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తాగడం వల్ల శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వేసవి తాపాన్ని తగ్గించడంతో పాటు మన ఆరోగ్యానికి మే\లు చేసే ఈ లస్సీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొకోనట్ లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఐస్ క్యూబ్స్ – 6, లేత కొబ్బరి – అర కప్పు, పంచదార – పావు కప్పు, కొబ్బరి నీళ్లు – 150 ఎమ్ ఎల్, తియ్యటి పెరుగు – 250 ఎమ్ ఎల్.
కొకోనట్ లస్సీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఐస్ క్యూబ్స్, లేత కొబ్బరి, పంచదార, కొబ్బరి నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత గ్లాస్ లో మరో రెండు ఐస్ క్యూబ్స్ వేసి లస్సీని పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొకోనట్ లస్సీ తయారవుతుంది. ఈ లస్సీ తయారీకి కొబ్బరి బోండాలో ఉండే లేత కొబ్బరిని మాత్రమే ఉపయోగించాలి. ఇలా కొబ్బరితో లస్సీ తయారు చేసుకుని తాగడం వల్ల వేడి నుండి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. శరీరం కొల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి శరీరానికి అందుతాయి. ఈ విధంగా కొకోనట్ లస్సీ ని తయారు చేసుకుని తాగడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.