Rajma : రాజ్మా గింజలను ఇలా వండుకుని తినండి.. రుచికి రుచికి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Rajma : శనగలు, పల్లీల మాదిరిగానే రాజ్మా గింజలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి చిక్కుడు జాతికి చెందినవి. అయితే చిక్కుడు, సోయా కన్నా అధిక మొత్తంలో ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. కనుక రాజ్మా గింజలను కూడా మనం తినాల్సి ఉంటుంది. వీటిని తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి ప్రోటీన్లు లభించడంతోపాటు రక్తం బాగా తయారవుతుంది. అలాగే అనేక పోషకాలు కూడా లభిస్తాయి. కనుక రాజ్మాను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక వీటితో కూరను ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

cook Rajma in this way very healthy
Rajma

పాలక్‌ రాజ్మా మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..

రాజ్మా గింజలు – ఒక కప్పు (ముందు రోజు నానబెట్టుకోవాలి), నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, బిర్యానీ ఆకులు – రెండు, యాలకులు – రెండు, ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, పచ్చి మిర్చి – రెండు, అల్లం ముద్ద – రెండు టీస్పూన్లు, వెల్లుల్లి ముద్ద – టేబుల్‌ స్పూన్‌, టమాటా గుజ్జు – అర కప్పు, ధనియాల పొడి – ఒక టీస్పూన్‌, పసుపు – అర టీస్పూన్‌, కారం – రెండు టీస్పూన్లు, గరం మసాలా – ఒకటిన్నర టీస్పూన్‌, ఉప్పు – తగినంత, పాలకూర తరుగు – రెండు కప్పులు, కసూరీ మేథీ – ఒక టీస్పూన్‌, కొత్తిమీర – ఒక కట్ట, నిమ్మరసం – రెండు టీస్పూన్లు, క్రీమ్ – రెండు టీస్పూన్లు.

పాలక్‌ రాజ్మా మసాలా తయారు చేసే విధానం..

స్టవ్‌ మీద కుక్కర్‌ను పెట్టి నూనె వేయాలి. అది కాగిన తరువాత బిర్యానీ ఆకులు, యాలకులు వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించాలి. అవి కూడా వేగాక అల్లం – వెల్లుల్లి ముద్ద వేయించుకుని తరువాత టమాటా గుజ్జు, ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అన్నీ వేగాక నానబెట్టుకున్న రాజ్మా వేసి మూత పెట్టి ఆరు విజిల్స్‌ వచ్చాక స్టవ్‌ని ఆఫ్‌ చేయాలి. ఆవిరంతా పోయాక మూత తీసి కుక్కర్‌ను మళ్లీ స్టవ్‌ మీద పెట్టి.. పాలకూర తరుగు, కసూరీ మేథీ, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. పాలకూర ఉడికిందనుకున్నాక క్రీమ్‌ వేసి దింపేయాలి. దీంతో రుచికరమైన పాలక్‌ రాజ్మా మసాలా రెడీ అవుతుంది. దీన్ని చపాతీల్లో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

Admin

Recent Posts