Coriander Chicken Roast : కొత్తిమీర చికెన్ రోస్ట్ త‌యారీ ఇలా.. ఒక్క‌సారి రుచి చూశారంటే విడిచిపెట్ట‌రు..

Coriander Chicken Roast : చికెన్‌తో చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. చికెన్ క‌ర్రీ, వేపుడు, బిర్యానీ, పులావ్‌.. ఇలా చేస్తుంటారు. అయితే చికెన్‌తో చేసే ఏ వంట‌కం అయినా స‌రే ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగానే తింటారు. అలాగే చికెన్‌తో రోస్ట్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. కొత్తిమీర క‌లిపి చేసే ఈ రోస్ట్ ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే కొత్తిమీర చికెన్ రోస్ట్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తిమీర చికెన్ రోస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర కిలో, కారం – 1 టేబుల్ స్పూన్‌, గ‌రం మ‌సాలా – 1 టేబుల్ స్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్‌, ప‌సుపు – చిటికెడు, నూనె – త‌గినంత‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, కొత్తిమీర తురుము – ఒక క‌ప్పు.

Coriander Chicken Roast recipe in telugu very tasty easy to cook
Coriander Chicken Roast

కొత్తిమీర చికెన్ రోస్ట్‌ను త‌యారు చేసే విధానం..

ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగిన చికెన్ లో కారం పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కొత్తిమీర తురుము వేసి ఈ మిశ్రమం మొత్తం చికెన్ ముక్కలకు పట్టే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గంట సమయం పాటు ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత స్టౌ పై ఒక పాన్ ఉంచి కొద్దిగా నూనె వేసి నూనె వేడయ్యాక ముందుగా కలిపి పెట్టిన చికెన్ మిశ్రమం మొత్తం వేసి బాగా కలియబెట్టాలి. త‌రువాత చికెన్ మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతూ చిన్నమంట పై బాగా వేయించాలి.

అవ‌స‌రం అనుకుంటే కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చికెన్‌ను ద‌గ్గ‌ర‌గా అయ్యేలా వేయిస్తూ ఉండాలి. చికెన్ ఉడికిన త‌రువాత మీద ఇంకాస్త కొత్తిమీర తురుము చ‌ల్లి గార్నిష్ చేసుకోవాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి దింపేయాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన కొత్తిమీర చికెన్ రోస్ట్ రెడీ అవుతుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని అన్నంతో క‌లిపి తిన‌వ‌చ్చు. లేదా ఏదైనా కూర‌తోపాటు అంచుకు పెట్టుకుని కూడా తిన‌వ‌చ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది.

Editor

Recent Posts