Coriander Rice : ఎంతో రుచిక‌ర‌మైన కొత్తిమీర రైస్‌.. ఆరోగ్యానికి చాలా మంచిది..!

Coriander Rice : కొత్తిమీరను రోజూ మ‌నం అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటాం. దీన్ని వంట‌ల చివ‌ర్లో వేస్తాం. అయితే తినేట‌ప్పుడు మాత్రం దీన్ని ప‌క్క‌న పెడ‌తారు. కానీ కొత్తిమీర వ‌ల్ల క‌లిగే లాభాలు తెలిస్తే ఎవ‌రూ అలా చేయ‌రు. కొత్తిమీర అనేక ర‌కాలైన ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. దీని వ‌ల్ల అనేక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అయితే కొత్తిమీరను తిన‌లేని వారు దాంతో రైస్ త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇలా తిన్నా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌రి కొత్తిమీర రైస్‌ను ఎలా త‌యారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

Coriander Rice is very tasty make it recipe is here
Coriander Rice

కొత్తిమీర రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – అర‌కిలో బియ్యంతో ఉడికించినంత‌, కొత్తిమీర – అన్నానికి స‌రిప‌డా, ప‌చ్చి మిర్చి – 5 లేదా 6, త‌రిగిన క్యారెట్ ముక్క‌లు – ఒక క‌ప్పు, ప‌చ్చి బ‌ఠానీ – అర క‌ప్పు, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్‌, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్‌, బిర్యానీ ఆకు – 2, దాల్చిన చెక్క – 2 చిన్న‌వి, యాల‌కులు – 3, ల‌వంగాలు – 5, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్‌, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్‌, ఉప్పు – రుచికి ప‌రిప‌డా, నూనె – 2 టీ స్పూన్స్‌.

కొత్తి మీర రైస్ త‌యారీ విధానం..

ముందుగా అన్నాన్ని చ‌ల్ల‌గా, పొడిగా అయ్యేలా ఆర‌బెట్టుకోవాలి. త‌రువాత ఒక జార్ లో కొత్తిమీర, ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు, కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ లా చేసుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక బిర్యానీ ఆకు, యాల‌కులు, ల‌వంగాలు, దాల్చిన చెక్క, జీల‌క‌ర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలి. త‌రువాత త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చి బ‌ఠానీ, క్యారెట్ ముక్క‌లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి వేయించుకోవాలి. ఇవి వేగాక ముందుగా పేస్ట్ లా చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మూత‌పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు ముందుగా ఆర‌బెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా క‌ల‌పాలి. ఇందులో రుచికి స‌రిప‌డా ఉప్పు, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి వేసి మ‌రో సారి క‌లుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మ‌రో 5 నిమిషాల పాటు ఉంచిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర రైస్ త‌యారవుతుంది. కొత్తిమీర రైస్ లో ప‌న్నీర్ ముక్క‌ల‌ను, కాలీ ప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను కూడా వేసుకోవ‌చ్చు. దీనిని నేరుగా లేదా పెరుగు చ‌ట్నీతో క‌లిపి తిన‌వ‌చ్చు. అన్నంతో ఇలా వెరైటీగా చేస్తే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ ల‌భిస్తాయి.

Share
D

Recent Posts