Crispy Chicken Pakoda : చికెన్ ప‌కోడీల‌ను ఇలా చేయండి.. బండ్ల మీద చేసిన‌ట్లు క్రిస్పీగా వ‌స్తాయి..!

Crispy Chicken Pakoda : బ‌యట వ‌ర్షం ప‌డుతున్నా లేదా చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఉన్నా.. చాలా మంది వేడి వేడిగా ఏదైనా చిరుతిండి తినేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. స‌మోసా, బ‌జ్జీ, ప‌కోడీ లాంటి వాటిని తింటూ చాయ్ తాగుతారు. అలాంట‌ప్పుడు వ‌చ్చే టేస్టే వేరుగా ఉంటుంది. చాలా మంది ఈ టేస్ట్‌ను ఎంజాయ్ చేసే ఉంటారు. అయితే ప‌కోడీల‌ను చాలా మంది చాయ్‌తో తింటుంటారు. కానీ ఆ ప‌కోడీల‌ను ఉల్లిపాయ‌ల‌తో కాకుండా చికెన్ చేస్తే ఇంకా ఎంతో బాగుంటాయి. వీటిని సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్‌గా వేడి వేడిగా తిన‌వ‌చ్చు. టేస్ట్ అదిరిపోతుంది.

అయితే చికెన్ ప‌కోడీ అన‌గానే చాలా మంది బ‌య‌ట బండ్ల‌పై చేసే చికెన్ ప‌కోడీల‌ను తింటారు. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. వారు ఉప‌యోగించే చికెన్‌తోపాటు నూనె కూడా మ‌న‌కు హాని క‌ల‌గ‌జేస్తుంది. క‌నుక చికెన్ ప‌కోడీల‌ను తినాల‌నుకుంటే ఇంట్లోనే వాటిని చేసుకోవ‌డం ఉత్త‌మం. ఇక చికెన్ ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Crispy Chicken Pakoda how to make this in telugu know the recipe
Crispy Chicken Pakoda

బోన్‌లెస్ చికెన్ అయితే మంచిది..

చికెన్ ప‌కోడీల‌ను చేయాలంటే చాలా మంది శ్ర‌మిస్తుంటారు. కానీ అందుకు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ స్టెప్స్‌ను పాటిస్తే చాలు, చికెన్ ప‌కోడీల‌ను చేయ‌డం చాలా సుల‌భం. దీంతో అవి రుచిగా, క్రిస్పీగా కూడా ఉంటాయి. ముందుగా బోన్‌లెన్ చికెన్ తీసుకోవాలి. ఇదైతేనే ప‌కోడీల‌ను అనువుగా ఉంటుంది. ముక్క‌లు మొత్తం స‌మానంగా వేగుతాయి. బోన్‌లెస్ చికెన్ తెచ్చి వాటిని చాలా చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. త‌రువాత చికెన్‌ను మారినేట్ చేయాల్సి ఉంటుంది. అందుకు గాను దాంట్లో కారం, ప‌సుపు, ఉప్పు, పెరుగు, నిమ్మ‌ర‌సం క‌లపాలి. బాగా క‌లిపిన త‌రువాత చికెన్‌ను ప‌క్క‌న పెట్టాలి.

అయితే మారినేట్ చేసే స‌మ‌యంలో కోడిగుడ్ల‌ను కొట్టి క‌లిపితే అన్ని మ‌సాలాలు చికెన్ ముక్క‌ల‌కు బాగా ప‌డ‌తాయి. ఇక అన్నీ క‌లిపిన చికెన్ ముక్క‌ల‌ను సుమారుగా 30 నిమిషాల పాటు మారినేట్ చేయాలి. స‌మ‌యం ఉంది అనుకుంటే 1 గంట వ‌ర‌కు మారినేట్ చేయ‌వ‌చ్చు. దీంతో ముక్క‌ల‌కు మ‌సాలాలు బాగా ప‌డ‌తాయి. త‌రువాత ముక్క‌ల‌పై శ‌న‌గ‌పిండి, కార్న్ ఫ్లోర్ వేసి బాగా క‌ల‌పాలి. కార్న్ ఫ్లోర్ వేయ‌డం వ‌ల్ల చికెన్ ముక్క‌లు క్రిస్పీగా వేగుతాయి. ఇక అవ‌స‌రం అనుకుంటే క‌సూరి మేథీ కూడా వేయ‌వ‌చ్చు. దీంతో చికెన్ ముక్క‌ల‌కు మంచి రుచి, వాస‌న వ‌స్తాయి. అలాగే కొత్తిమీర ఆకుల‌ను కూడా వేయ‌వ‌చ్చు.

రెండు సార్లు వేయించాలి..

ఇలా త‌యారు చేసిన చికెన్ ముక్క‌ల‌ను నూనెలో వేయించుకుంటే చాలు. ముందుగా ముక్క‌ల‌ను మీడియం మంట‌పై 5-7 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ముక్క‌ల‌ను తీసి ప‌క్క‌న పెట్టి కాసేపు అయ్యాక మ‌ళ్లీ వాటిని నూనెలో వేసి ఈసారి త‌క్కువ మంట‌పై వేయించాలి. ఇలా అన్ని ముక్క‌ల‌ను వేయిస్తే చాలు. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన చికెన్ ప‌కోడీలు రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు లేదా ఏదైనా గ్రీన్ చ‌ట్నీతో తిన‌వ‌చ్చు. సాయంత్రం స‌మ‌యంలో ఇలా స్నాక్స్ చేసి వేడిగా తింటే టేస్ట్ అదిరిపోతుంది. చికెన్ ప‌కోడీల‌ను ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే ఇష్టంగానే తింటారు.

Editor

Recent Posts