Crispy Gobi 65 : ఈ టెక్నిక్‌తో చేశారంటే.. రెస్టారెంట్ స్టైల్‌లో గోబీ 65ని ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Crispy Gobi 65 : క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో గోబీ 65 కూడా ఒక‌టి. మ‌న‌కు హోటల్స్, క్యాట‌రింగ్ లో, కర్రీ పాయింట్ ల‌లో ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. గోబీ 65 క‌ర‌క‌రలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లోనే రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే గోబి 65 ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్పీ గోబీ 65 త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యాలీప్ల‌వ‌ర్ – మ‌ధ్య‌స్థంగా ఉండేది ఒక‌టి, మైదా పిండి – అర క‌ప్పు, కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ముప్పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత‌, వంట‌సోడా – చిటికెడు, త‌రిగిన క‌రివేపాకు – కొద్దిగా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Crispy Gobi 65 recipe in telugu make it in restaurant style
Crispy Gobi 65

క్రిస్పీగోబీ 65 త‌యారీ విధానం..

ముందుగా క్యాలీప్ల‌వ‌ర్ ను పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. త‌రువాత ఇందులో ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత వీటిని వ‌డ‌క‌ట్టి నీరంతా పోయే వ‌ర‌కు జ‌ల్లి గంటెలో వేసి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఒక గిన్నెలో మైదాపిండి, కార్న్ ఫ్లోర్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి. పిండి మ‌రీ ప‌లుచ‌గా, మ‌రీ గ‌ట్టిగా కాకుండా చూసుకోవాలి. ఇలా పిండిని క‌లుపుకున్న తరువాత క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక మంట‌ను మ‌ధ్య‌స్థంగా చేయాలి. త‌రువాత నూనెకు త‌గినన్ని క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసుకుని వేయించాలి. వీటిని వేసిన వెంట‌నే క‌దిలించ‌కుండా ఒక నిమిషం త‌రువాత అటూ ఇటూ క‌దిలిస్తూ వేయించుకోవాలి. వీటిని క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ గోబి 65 త‌యార‌వుతుంది. సైడ్ డిష్ గా తింటే ఈ గోబి 65 చాలా రుచిగా ఉంటుంది. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts