Crispy Rava Dosa : బండి మీద చేసే క‌ర‌క‌ర‌లాడే క్రిస్పీ ర‌వ్వ దోశ‌ను ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు..!

Crispy Rava Dosa : మ‌న‌కు బండ్ల మీద‌, టిఫిన్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో ర‌వ్వ దోశ కూడా ఒక‌టి. ర‌వ్వ దోశ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. చాలా మంది ఈ ర‌వ్వ దోశ‌ను ఇంట్లో త‌యారు చేసుకున్న‌ప్ప‌టికి అది మెత్త‌గా వ‌స్తుంది. అలాగే పెనానికి అంటుకుపోతూ ఉంటుంది. పెనానికి అంటుకుపోకుండా, ర‌వ్వ క్రిస్పీగా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్పీ ర‌వ్వ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పుల్ల‌టి పెరుగు – పావు క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, బియ్యం పిండి – ముప్పావు క‌ప్పు, మిరియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, త‌రిగిన క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, నీళ్లు – 4 క‌ప్పులు, ఉల్లిపాయ త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, ప‌చ్చిమిర్చి త‌రుగు – ఒక టేబుల్ స్పూన్, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్.

Crispy Rava Dosa recipe in telugu very tasty
Crispy Rava Dosa

క్రిస్పీ ర‌వ్వ దోశ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్క‌లు, కొత్తిమీర‌, అల్లం త‌రుగ‌రు, ప‌చ్చిమిర్చి వేసి క‌లిపి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు మరో గిన్నెలో పెరుగు, ఉప్పు వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత ఇందులో బొంబాయి ర‌వ్వ‌, బియ్యం పిండి వేసుకోవాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌ను, మిరియాల‌ను బ‌ర‌క‌గా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. త‌రువాత క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. ఇలా అన్నింటిని క‌లిపిన త‌రువాత 2 కప్పుల నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిని ఉండ‌లు లేకుండా క‌లుపుకున్న త‌రువాత మిగిలిన నీటిని పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి ర‌వ్వ‌ను 15 నిమిషాల పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక దాని మీద కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ‌తో రుద్దాలి. త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న ఉల్లిపాయ ముక్క‌ల‌ను పెనం మీద అక్క‌డ‌క్క‌డ చ‌ల్లుకోవాలి. తరువాత దీనిపై ర‌వ్వ మివ్ర‌మాన్ని అడుగు నుండి క‌లుపుతూ వేసుకోవాలి.

ఇలా వేసుకున్న త‌రువాత ఈ దోశ‌ను నూనె వేసుకుంటూ పెద్ద మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. దోశ ఎర్ర‌గా కాలిన త‌రువాత దానిపై మ‌రి కొద్దిగా బ‌ట‌ర్ ను రాసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. దోశ‌ను రెండో వైపు కాల్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు. అలాగే ర‌వ్వ దోశ సాధార‌ణ దోశ‌లాగా వేసుకోవ‌డానికి రాదు. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే ర‌వ్వ దోశ త‌యార‌వుతుంది. దీనిని కొబ్బ‌రి చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు లేదా నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా ర‌వ్వ దోశను అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts