Custard Bread Pudding : బేక‌రీల‌లో ల‌భించే క‌స్ట‌ర్డ్ బ్రెడ్ పుడ్డింగ్‌.. ఇలా ఈజీగా చేసేయండి..!

Custard Bread Pudding : క‌స్ట‌ర్డ్ బ్రెడ్ పుడ్డింగ్.. బ్రెడ్, క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ క‌లిపి చేసే ఈ పుడ్డింగ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. చ‌ల్ల చ‌ల్ల‌గా ఎంతో రుచిగా ఉండే ఈ పుడ్డింగ్ ను పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు. చ‌ల్ల‌గా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు, నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు ఈ పుడ్డింగ్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, చ‌ల్ల చ‌ల్ల‌గా ఉండే ఈ క‌స్ట‌ర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క‌స్ట‌ర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పాలు – అర లీట‌ర్, క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ – పావు క‌ప్పు, బ్రెడ్ స్లైసెస్ – 8, త‌రిగిన బాదంప‌ప్పు – 8, జీడిప‌ప్పు ప‌లుకులు – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, టూటీ ప్రూటీ – 2 టేబుల్ స్పూన్స్, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ – కొద్దిగా.

Custard Bread Pudding recipe in telugu make it like this
Custard Bread Pudding

క‌స్ట‌ర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. అలాగే ఒక అర క‌ప్పు పాలల్లో క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ వేసి క‌లిపి ప‌క్క‌కు ఉంచాలి. పాలు మ‌రిగిన త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి క‌స్ట‌ర్డ్ పౌడ‌ర్ క‌లిపిన పాలు పోసి క‌ల‌పాలి. దీనిని ఉండ‌లు లేకుండా క‌లిపిన త‌రువాత కొద్దిగా చిక్క‌బ‌డే వ‌ర‌కు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో జీడిప‌ప్పు ప‌లుకులు, బాదంప‌లుకులు, ఎండు కొబ్బరి పొడి, టూటీ ఫ్రూటీ వేసి క‌లిపి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని వాటికి ఉండే అంచుల‌ను తీసి వేయాలి. త‌రువాత జామ్ రాసిన బ్రెడ్ స్లైస్ ను తీసుకుని దానిపై ముందుగా సిద్దం చేసుకున్న కొబ్బ‌రి పొడి మిశ్ర‌మాన్ని చ‌ల్లుకోవాలి.

త‌రువాత దీనిపై జామ్ రాసిన బ్రెడ్ స్లైస్ ను ఉంచాలి. ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న త‌రువాత ఒక ట్రేను తీసుకుని అందులో కొద్దిగా ముందుగా సిద్దం చేసుకున్న పుడ్డింగ్ వేసి ట్రే అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. త‌రువాత ఇందులో బ్రెడ్ స్టైసెస్ ను ఉంచాలి. త‌రువాత వీటిపై మిగిలిన క‌స్టర్డ్ పుడ్డింగ్ వేసి పైన స‌మానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. త‌రువాత దీనిపై మ‌న‌కు న‌చ్చిన తియ్య‌టి ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. త‌రువాత ఈ ట్రేను రెండు గంట‌ల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. త‌రువాత బ‌ట‌య‌కు తీసి ముక్క‌లుగా క‌ట్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts