Honey For Teeth Pain : మనల్ని వేధించే దంత సంబంధిత సమస్యల్లో పిప్పి పన్ను సమస్య కూడా ఒకటి. జీవితంలో ఎప్పుడోకప్పుడు మనం ఈ సమస్య బారిన పడాల్సిందే. అలాగే ఈ మధ్యకాలంలో పిప్పి పన్నుతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. పిప్పి పన్ను వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. పిప్పి పన్ను తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఒక్కసారి దంతం పుచ్చితే తిరిగి సాధారణ స్థితికి రాదు. అక్కడ ఉండే ఇన్పెక్షన్ ను మాత్రమే మనం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు చాలా మంది పెయిన్ కిల్లర్ లను, యాంటీ బయాటిక్స్ ను వాడుతూ ఉంటారు. ఇలా నొప్పి వచ్చిన వెంటనే మందులు వాడడానికి బదులుగా ఇప్పుడు చెప్పినట్టుగా చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ చిట్కాలను పాటించడం వల్ల పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి, ఇన్పెక్షన్ తగ్గుతుందని వారు చెబుతున్నారు. పిప్పి పన్ను నొప్పితో బాధపడుతున్నప్పుడు పిప్పి పన్నుపై తేనెను వేయాలి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్పెక్షన్ ను తగ్గించడంలో సహాయపడతాయి. రోజులో 4 నుండి 5 సార్లు ఇలా తేనెను వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే తేనెను బ్రష్ తో తీసుకుని దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్పెక్షన్ తగ్గుతుంది. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే పిప్పి పన్ను నొప్పి మరీ వేధిస్తున్నప్పుడు తేనె నీటిని తీసుకుంటూ ఉపవాసం చేయడం వల్ల ఇన్పెక్షన్ త్వరగా తగ్గుతుంది. రోజులో 4 నుండి 5 సార్లు గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి కలిపి తీసుకుంటూ ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయాలి. ఇలా రెండు రోజుల పాటు చేయడం వల్ల ఇన్పెక్షన్, బాధ, వాపు తగ్గుతుంది.
పిప్పి పన్నుపై వేడి నీటితో కాపడం పెట్టడం వల్ల వాపు, నొప్పి నుండి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. అలాగే పిప్పి పన్ను నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు పన్ను లోపల ఇంగువను ఉంచాలి. ఇంగువను వేడి చేయడం వల్ల కొద్దిగా మెత్తబడుతుంది. ఇలా మెత్తబడిన ఇంగువను పిప్పి పన్నుపై ఉంచడం వల్ల క్రిములు, బ్యాక్టీరియా నశిస్తాయి. దీంతో ఇన్పెక్షన్, నొప్పి తగ్గుతుంది. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి, ఇన్పెక్షన్ తగ్గుతుంది. అయితే సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. కొన్నిసార్లు సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పిప్పి పన్నును వైద్యులు తొలగిస్తూ ఉంటారు. అలాగే మందులు సూచిస్తూ ఉంటారు. కనుక తీవ్రతను బట్టి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. పిప్పి పన్ను వచ్చిన తరువాత బాధపడడం కంటే సమస్య రాకుండా చూసుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.