Custard Powder : కస్టర్డ్ పౌడర్.. ఇది మనందరికి తెలిసిందే. దీనితో మనం అనేక రకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ సలాడ్స్ ఇలా రకరకాల తీపి వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. సాధారణంగా ఈ కస్టర్డ్ పౌడర్ ను మనం బయట నుండి కొనుగోలు చేస్తూ ఉంటాము. కానీ చాలా సులభంగా దీనిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట కొనే పనే ఉండదు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇలా ఇంట్లో తయారు చేసిన చేసిన కస్టర్డ్ పౌడర్ తో కూడా అనేక రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కస్టర్డ్ పౌడర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార – అర కప్పు, కార్న్ ఫ్లోర్ – ఒక కప్పు, పాలపొడి – ఒక కప్పు, వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్, ఎల్లో ఫుడ్ కలర్ – పావు టీ స్పూన్ నుండి అర టీ స్పూన్.
కస్టర్డ్ పౌడర్ తయారీ విధానం..
ముందుగా జార్ లో పంచదార వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులో కార్న్ ఫ్లోర్, పాలపొడి, వెనీలా ఎసెన్స్, ఫుడ్ కలర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని గిన్నెలోకి చల్లారిన తరువాత గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చక్కటి రంగుతో ఉండే కస్టర్డ్ పౌడర్ తయారవుతుంది. ఈ పౌడర్ ను జల్లించి కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇలా తయారుచేసిన కస్టర్డ్ పౌడర్ 6 నుండి 9 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇలా ఇంట్లో తయారు చేసిన కస్టర్డ్ పౌడర్ తో కూడా అనేక రకాల తీపి వంటకాలను తయారు చేసి తీసుకోవచ్చు.