Tea And Coffee : మనలో చాలా మంది టీ, కాఫీలను ఇష్టంగా తాగుతారు. శక్తి కొరకు, మానసిక ఉల్లాసం కొరకు, ఎక్కువ సమయం వరకు మేల్కొని ఉండడానికి, ఉత్సాహంగా పనిచేయడానికి, ఏకాగ్రతను పెంచుకోవడానికి టీ, కాఫీలను తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా టీ, కాఫీలను తీసుకోవడం వల్ల మన శరీరంలోకి కెఫిన్ ఎక్కువగా వెళ్తుంది. కెఫిన్ ను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. కెఫిన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీర్ణసమస్యలు, చికికు, తలనొప్పి, మూత్ర సంబంధిత సమస్యలు, నిద్రలేమి, తరుచూ భయంగా ఉండడం వంటి వివిధ రకాల సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మనం కెఫిన్ ను తక్కువగా తీసుకోవాలి. మనం రోజుకు గరిష్టంగా 400 మిల్లీ గ్రాములు అనగా 3 నుండి 5 కప్పుల కాఫీని మాత్రమే తీసుకోవాలి. ఇంత కంటె ఎక్కువ కెఫిన్ ను మనం తీసుకోకూడదు.
అయితే కెఫిన్ ను తీసుకోకుండా కూడా మనం శక్తిని పొందవచ్చు. కాఫీ,టీ లకు ప్రత్యమ్నాయంగా ఇతర ఆహారాలను, పనులను చేయడం వల్ల మనం ఉత్సాహంగా, ఏకాగ్రతతో పని చేసుకోవచ్చు. దీంతో తక్కువ మొత్తంలో కెఫిన్ మన శరీరంలోకి వెళ్తుంది. మన ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది. కెఫిన్ కు ప్రత్యమ్నాయంగా ఇతర మార్గాల ద్వారా మనం శక్తిని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. టీ, కాఫీలు తాగాలనిపించినప్పుడు వాటికి బదులుగా సలాడ్ ను తీసుకోవాలి. క్యాబేజి, బచ్చలికూర, కీరదోస వంటి వాటితో పాటు నారింజ, అరటిపండ్లు, యాపిల్స్ వంటి వాటితో సలాడ్ ను చేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది. ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అలాగే కాపీ, టీ లకు బదులుగా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల అవుతాయి. దీంతో మన మానసిక స్థితి మెరుగుపడుతుంది.
వ్యాయామం చేయడం వల్ల సహజమైన మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే కెఫిన్ కు బదులుగా నీటిని తాగడం మంచిది. టీ, కాఫీలు తాగాలనిపించినప్పుడు ఒక గ్లాస్ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శరీరం కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే సమయానికి నిద్రపోవడం ఉదయాన్నే లేవడం వంటివి చేయాలి. దీంతో అలసట తగ్గుతుంది. ఉదయాన్నే ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. నీరసం, అలసట దరి చేరకుండా ఉంటాయి. వీటితో పాటు ఒత్తిడి దరి చేరకుండా చూసుకోవాలి. ఒత్తిడి, ఆందోళన వంటివి దరి చేరడం వల్ల అలసటగా ఉంటుంది. కనుక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి.ఈ విధంగా ఈ పనులను చేయడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. టీ, కాఫీలను తక్కువగా తీసుకోగలుగుతాము. శరీరంలో కెఫిన్ ఎక్కువగా వెళ్లకుండా ఉంటుంది. దీంతో ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది.