Dahi Tadka : మనం పెరుగును ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పెరుగును తినడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది. మన అందాన్ని మెరుగుపరచడంలో కూడా పెరుగు మనకు ఎంతో దోహదపడుతుంది. పెరుగునునేరుగా తినడంతో పాటు దీనితో ఎంతో రుచిగా దహీ తడ్కాను కూడా తయారు చేసుకోవచ్చు. పెరుగుతో చేసే ఈ దహీ తడ్కా చాలా రుచిగా ఉంటుంది. కేవలం 10 నిమిషాల్లోనే మనం దీనిని తయారు చేసుకోవచ్చు. దహీ తడ్కాను తినడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఎంతో రుచిగా ఉండే దహీ తడ్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దహీ తడ్కా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – 200 గ్రా., చిన్నగా తరిగిన క్యారెట్ – 1, చిన్నగా తరిగిన క్యాప్సికం – 1, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
దహీ తడ్కా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో చిలికిన పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కొత్తిమీర, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె వేసి కలపాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి తరుగు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, క్యారెట్, క్యాప్సికం వేసి వేయించాలి. క్యారెట్ ముక్కలు వేగిన తరువాత పసుపు, కారం వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాళింపు చల్లారిన తరువాత పెరుగులో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దహీ తడ్కా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా దహీ తడ్కాను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.