Dalgona Coffee : రెస్టారెంట్ల‌లో అందించే ఈ కాఫీని ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Dalgona Coffee : మ‌న‌కు కాఫీ షాపుల్లో వివిధ రుచుల్లో ర‌క‌ర‌కాల కాఫీలు ల‌భిస్తూ ఉంటాయి. చాలా మంది ఈ కాఫీల‌ను ఇష్టంగా తాగుతారు. మ‌న‌కు కాఫీ షాపుల్లో ల‌భించే కాఫీలు క్రీమీ టెక్చ‌ర్ తో చాలా రుచిగా ఉంటాయి. అచ్చం కాఫీ షాపుల్లో ల‌భించే విధంగా అదే రుచితో అదే స్టైల్ లో కాఫీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కాఫీ షాపుల్లో ల‌భించే డాల్గోనా కాఫీని చాలా సుల‌భంగా ఇంట్లో కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఇంట్లో ఇన్ స్టాంట్ కాఫీ పౌడ‌ర్ ఉంటే చాలు ఈ కాఫీని చిటికెలో త‌యారు చేసుకోవ‌చ్చు. డాల్గోనా కాఫీని కాఫీషాప్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

డాల్గోనా కాఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కాచి చ‌ల్లార్చిన పాలు – 300 ఎమ్ ఎల్, ఇన్ స్టాంట్ కాఫీ పౌడ‌ర్ – 2 టేబుల్ స్పూన్స్, పంచ‌దార – 4 టేబుల్ స్పూన్స్, వేడి వేడి నీళ్లు – 2 టేబుల్ స్పూన్స్.

Dalgona Coffee recipe in telugu make in restaurant style
Dalgona Coffee

డాల్గోనా కాఫీ త‌యారీ విధానం..

ముందుగా కాచి చ‌ల్లార్చిన పాల‌ను ఫ్రిజ్ లో పెట్టి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత గిన్నెలో కాఫీ పౌడ‌ర్, పంచ‌దారను తీసుకోవాలి. త‌రువాత ఇందులో మ‌రుగుతున్న నీటిని పోసుకోవాలి. ఇప్పుడు స్పూన్, విస్క‌ర్ తో లేదా బీట‌ర్ తో బీట్ చేసుకోవాలి. కాఫీ మిశ్ర‌మం క్రీమ్ లాగా అయ్యే వ‌ర‌కు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల డాల్గోనా మిక్స్ త‌యార‌వుతుంది. ఈ మిక్స్ ను త‌యారు చేసుకుంటే చాలు మ‌నం వివిధ రుచుల్లో కాఫీని త‌యారు చేసుకోవ‌చ్చు. ముందుగా ఒక గ్లాస్ అంచుల చుట్టు చాక్లెట్ సిర‌ప్ ను వేసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక ఐస్ క్యూబ్ ను, ఒక టీ స్పూన్ పంచ‌దారను వేసుకోవాలి.

త‌రువాత మూడు వంతులు చ‌ల్ల‌టి పాల‌ను పోసుకోవాలి. త‌రువాత దీనిపై డాల్గోనా మిక్స్ ను వేసి పైక చాకో చిప్స్ ను చ‌ల్లుకుని స‌ర్వ్ చేసుకోవాలి. అలాగే గ్లాస్ లో ఐస్ క్యూబ్, పంచ‌దార‌ను వేసుకుని త‌రువాత మూడు వంతులు చ‌ల్ల‌టి పాల‌ను పోసి పైన డాల్గోనా మిక్స్ ను వేసుకోవాలి. ఇలా కూడా కాఫీని త‌యారు చేసుకుని స‌ర్వ్ చేసుకోవ‌చ్చు. అలాగే గ్లాస్ లో పంచ‌దార‌ను వేసుకోవాలి. త‌రువాత డాల్గోనా మిక్స్ ను వేసి పైన పాల‌ను పోసి కూడాస‌ర్వ్ చేసుకోవ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల కాఫీ షాప్ స్టైల్ లో కాఫీల‌ను ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన కాఫీని ఒక్క చుక్క కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు.

D

Recent Posts