lifestyle

Death Person In Dream : చ‌నిపోయిన వారు ప‌దే ప‌దే క‌ల‌లో క‌నిపిస్తున్నారా..? వారు ఎలా క‌నిపిస్తే.. ఏం చేయాలో తెలుసా ?

Death Person In Dream : సాధార‌ణంగా మ‌న‌కు అత్యంత ద‌గ్గ‌రి బంధువులు లేదా కుటుంబ స‌భ్యులు లేదా స్నేహితులు, తెలిసిన వారు చనిపోతే మ‌న‌కు వారు క‌ల‌లో క‌నిపిస్తుంటారు. వారితో మ‌న‌కు ఉన్న జ్ఞాప‌కాల‌ను బ‌ట్టి మ‌న‌కు వారు క‌ల‌లో క‌నిపిస్తారు. అయితే చ‌నిపోయిన వారు ఇలా క‌ల‌లో క‌నిపించ‌డం అంటే.. అందుకు కొన్ని కార‌ణాలు ఉంటాయ‌ని పండితులు చెబుతున్నారు. మ‌రి ఆ కార‌ణాలు ఏమిటంటే..

చ‌నిపోయిన వారు ఎప్పుడో ఒక‌సారి మ‌న‌కు క‌ల‌లో క‌నిపిస్తే.. ఓకే. కానీ వారు త‌ర‌చూ క‌ల‌లో క‌నిపిస్తున్నారంటే.. వారి ఆత్మ ఇంకా ఈ లోకంలోనే సంచ‌రిస్తుంద‌ని.. వారు ఏదో ఆశిస్తున్నార‌ని అర్థం. అందుక‌నే త‌ర‌చూ ఎవ‌రో ఒక‌రికి వారు క‌ల‌లో కనిపిస్తుంటారు. ఇలా క‌నిపిస్తే.. చ‌నిపోయిన వారి పేరిట రామాయణం, భాగ‌వ‌తం వంటి పురాణాలు చద‌వాల‌ని పండితులు చెబుతున్నారు.

dead person in dream what is the meaning

ఇక చ‌నిపోయిన వారు బాధ‌తో మీకు క‌ల‌లో క‌నిపిస్తే.. మీకు ఏదో కీడు జ‌ర‌గ‌బోతుంద‌ని అర్థం. అలాంట‌ప్పుడు శాంతి చేయించాలి. అలాగే చ‌నిపోయిన వారు క‌ల‌లో ఏమీ మాట్లాడ‌కుండా మౌనంగా క‌నిపిస్తే.. అప్పుడు పేద‌ల‌కు అన్న‌దానం చేస్తే వారి ఆత్మ శాంతిస్తుంద‌ని పండితులు చెబుతున్నారు.

ఇక క‌ల‌లో చ‌నిపోయిన‌వారు బాగా కోపంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తే.. వారు మీ నుంచి ఏదో ఆశిస్తున్నార‌ని అర్థం. వారి పేరిట ఏదైనా దానం చేస్తే ఆత్మ శాంతిస్తుంది. అలాగే చ‌నిపోయిన వారు క‌ల‌లో సంతోషంగా న‌వ్వుతూ క‌నిపిస్తున్నారు అంటే.. మీకు అన్నీ శుభాలే క‌ల‌గ‌బోతున్నాయ‌ని అర్థం. ఇలా చ‌నిపోయిన వారు క‌ల‌లో క‌నిపిస్తే మ‌నం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మ‌నం ఏదైనా చేసేవ‌ర‌కు వారి ఆత్మ ఈలోకంలోనే ఉంటుంది. వారు ఆశించింది మ‌నం చేస్తూ అప్పుడు వారి ఆత్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతుంది.

Admin

Recent Posts