technology

Apple iPhone 15 ని కేవలం రూ. 23,849కే ఇలా పొందండి..!

ఆపిల్ ఐఫోన్ తక్కువ ధరకే ఇప్పుడు డిస్కౌంట్ లో లభిస్తుంది. మరి ఇంక ఎంత తగ్గింది వంటి వివరాలను చూసేద్దాం. రూ. 25,000 కంటే తక్కువ ధరకు తగ్గడంతో ఆపిల్ 15, 128 జీబీ బ్లూ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 2023లో ఆపిల్ యొక్క వండర్ లస్ట్ ఈవెంట్ లో స్మార్ట్ఫోన్ ని మొదటిసారి విడుదల చేసినప్పుడు 128GB మోడల్ ధర రూ.7,990 ఉండేది. ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్లలో రూ. 23,849కి తగ్గించింది. ఈ ఫోనే కాకుండా 512GB మోడల్ ధర రూ. 1,09,990 కాగా, 256GB మోడల్ ధర రూ. 89,990. ఇలా తక్కువకే ఫోన్ ని కొనుగోలు చెయ్యొచ్చు.

ఫ్లిప్కార్ట్ లో ఆపిల్ iPhone 15 (128 GB, బ్లూ) రిటైల్ ధర రూ. 69,900. ఇప్పుడు 17% తగ్గిన తర్వాత రూ. 57,999. అదనంగా మీ పాత స్థితిలో ఉన్న iPhone 14 ప్లస్‌ని మార్చుకోవడం ద్వారా మీకు రూ. 29,350 ఆదా చెయ్యొచ్చు. దీని ద్వారా Apple ఫోన్ మొత్తం ధర రూ. 28,649కి తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుని ఉపయోగించే రూ. 4,800 తగ్గింపును పొందవచ్చు.

iphone 15 now available at discounted price

డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీ కలిగి ఉంది. అలాగే ఐఫోన్ 15 దాని 6.1-అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. గరిష్టంగా 2000 నిట్‌ల ప్రకాశాన్ని అందిస్తుంది. క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌తో కూడిన 48 MP ప్రైమరీ కెమెరా మరియు ఆటోఫోకస్ కోసం 100% ఫోకస్ పిక్సెల్‌స్ ఐఫోన్ 15తో వస్తాయి. దీనికి 24MP సూపర్-హై రిజల్యూషన్ డిఫాల్ట్ సెట్టింగ్‌ కూడా ఇచ్చారు.

Peddinti Sravya

Recent Posts