Dhaba Style Chicken Handi : ధాబా స్టైల్‌లో చికెన్ హండిని ఇలా చేస్తే.. చ‌పాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది..

Dhaba Style Chicken Handi : చికెన్ అంటే చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తింటుంటారు. చికెన్‌తో అనేక ర‌కాల వెరైటీల‌ను చేస్తుంటారు. చికెన్ క‌ర్రీ, వేపుడు, బిర్యానీ.. ఇలా చేసి తింటారు. చికెన్‌తో ఏం చేసినా రుచిగానే ఉంటుంది. ఇక మ‌నం ప్ర‌యాణాలు చేసిన‌ప్పుడు లేదా అప్పుడ‌ప్పుడు రెస్టారెంట్ల‌లోనూ చికెన్ వంట‌కాల‌ను తింటుంటాం. వాటిల్లో చికెన్ హండి కూడా ఒక‌టి. దీన్ని రోటీ లేదా చ‌పాతీల‌తో క‌లిపి తింటే బాగుంటుంది. అయితే దీన్ని మ‌నం ఇంట్లోనూ త‌యారు చేసుకోవ‌చ్చు. కాస్త శ్ర‌మించాలే కానీ అద్భుత‌మైన చికెన్ హండి రెడీ అవుతుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ధాబా స్టైల్ చికెన్ హండి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర కిలో, నూనె – 4 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 1 టేబుల్ స్పూన్‌, జీల‌క‌ర్ర – అర టేబుల్ స్పూన్‌, ఉల్లిపాయ‌లు (త‌రిగిన‌వి) – 1 క‌ప్పు, ట‌మాటాలు – 1 క‌ప్పు, ప‌సుపు – అర టేబుల్ స్పూన్‌, కారం – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్‌, ధ‌నియాల పొడి – 1 టేబుల్ స్పూన్‌, జీల‌క‌ర్ర పొడి – పావు టేబుల్ స్పూన్‌, పెరుగు – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – 1 క‌ప్పు, క‌సూరీ మేథీ – 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి – పావు టేబుల్ స్పూన్‌, గ‌రం మ‌సాలా – అర టేబుల్ స్పూన్‌, క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు (స‌న్న‌గా త‌ర‌గాలి), ప‌చ్చి మిర్చి – 1.

Dhaba Style Chicken Handi recipe in telugu tastes better with roti
Dhaba Style Chicken Handi

ధాబా స్టైల్ చికెన్ హండిని త‌యారు చేసే విధానం..

ఒక పాన్ తీసుకుని 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అందులో చికెన్ వేసి 10 నిమిషాల పాటు వేయించాలి. అనంత‌రం చికెన్‌ను వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే పాన్‌లో మ‌రి కొంత నూనె వేసి దానికి ఒక టీస్పూన్ నెయ్యి జ‌త చేయాలి. అనంత‌రం జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ‌లు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాటాలు వేసి కాసేపు ఉడికించాలి. అనంత‌రం అవి మెత్త‌గా అవ‌గానే కారం, ధ‌నియాల పొడి, ప‌సుపు, జీల‌క‌ర్ర పొడి, ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. అన్ని మ‌సాలాలు, చికెన్ ముక్క‌లు క‌లిసేలా బాగా క‌లిపి అనంత‌రం మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. దీంతో మ‌సాలాలు ముక్క‌ల‌కు బాగా ప‌డ‌తాయి.

త‌రువాత పెరుగు వేసి క‌లిపి మూత పెట్టి మ‌ళ్లీ 2 నిమిషాల పాటు ఉడికించాలి. అనంత‌రం నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించాలి. దీంతో చికెన్ మెత్త‌గా అవుతుంది. త‌రువాత గ‌రం మ‌సాలా పొడి, మిరియాల పొడి, క‌సూరీ మేథీ వేసి క‌లపాలి. త‌రువాత క్రీమ్ వేయాలి. బాగా క‌ల‌పాలి. దీంతో కూర క‌ల‌ర్ మారుతుంది. త‌రువాత కాసేపు ఉడికించి అనంత‌రం మూత తీసి క‌లిపి మీద కొత్తిమీర, ప‌చ్చి మిర్చితో గార్నిష్ చేయాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన ధాబా స్టైల్ చికెన్ హండి రెడీ అవుతుంది. దీన్ని రోటీ లేదా చ‌పాతీల‌తో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
Editor

Recent Posts