Died Person Items : చ‌నిపోయిన వారి వ‌స్తువుల‌ను ఏం చేయాలి..? ఉంచాలా..? ప‌డేయాలా..?

Died Person Items : పుట్టిన ప్ర‌తి ఒక్క‌రు మ‌ర‌ణించ‌క తప్ప‌దు. జ‌న‌న‌, మ‌ర‌ణాలు అనేవి మ‌న చేతిలో ఉండేవి కావు. మ‌న కుటుంబ సభ్య‌లు, బంధువులు, స‌న్నిహితులు మ‌ర‌ణిస్తే మ‌నం ప‌డే బాధ‌ అంతా ఇంతా కాదు. ఆ బాధ అనుభ‌వించే వారికే తెలుస్తుంది. అలాగే వ్య‌క్తి మ‌ర‌ణించిన త‌రువాత వారు వాడిన వ‌స్తువుల‌ను ఏం చేయాలి… వాటిని ఇత‌రులు వాడ‌వ‌చ్చు… ఎవ‌రికైనా ఇవ‌వ్వ‌చ్చా.. ఇలా అనేక సందేహాలు వ‌స్తూ ఉంటాయి. అలాగే ఎవ‌రైనా మంచం మీద చనిపోతే ఆ మంచాన్ని ఇంట్లో ఉంచుకోవ‌చ్చా ఆ మంచాన్ని ఏం చేయాలి.. ఇలా అనేక సందేహాలు వ‌స్తూ ఉంటాయి. అస‌లు చ‌నిపోయిన వారి వ‌స్తువుల‌ను ఏం చేయాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చ‌నిపోయిన వారి దుస్తుల‌ను ధ‌రించ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు.

చ‌నిపోయిన వారు ధ‌రించిన బ‌ట్ట‌ల‌ను మ‌నం ధ‌రించ‌డం వ‌ల్ల వారి ఆత్మ వాస‌న‌ను ప‌సిగ‌ట్టి మ‌న ద‌గ్గ‌రికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ట‌. ఒక వేళ వారు ధ‌రించిన దుస్తులు అధిక ధ‌ర‌వి అయితే వాటిని శుభ్రంగా ఉతికి డ్రై క్లీనింగ్, డ్రై వాష్ వంటివి చేసిన త‌రువాతే ధ‌రించాలి లేదా వారి దుస్తుల‌ను ఎవ‌రికైనా దానం ఇవ్వ‌వ‌చ్చు. అలాగే వారు వాడిన వ‌స్తువుల‌ను కూడా ఇత‌రులకు దానం ఇవ్వాలి. ఒక‌వేళ అవి వెండి వ‌స్తువులు అయితే వాటిని క‌రిగించి ఇత‌ర వెండి వ‌స్తువులు త‌యారు చేయించుకోవాలి. అయితే ఈ వ‌స్తువుల‌ను పూజారాధ‌న‌కు మాత్రం ఉప‌యోగించ‌వ‌చ్చు.

Died Person Items what we have to do about them
Died Person Items

అలాగే పూర్వ‌కాలంలో మ‌న‌కు నుల‌క మంచాలు, న‌వారి మంచాలు ఉండేవి. వ్య‌క్తి చ‌నిపోగానే ఆ వ‌స్తువుల‌ను ఇత‌రుల‌కు ఇచ్చేవారు. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌నం బెడ్, దివాన్ కాట్ వంటి వాటిని వాడుతున్నాం. అధిక ధ‌ర‌లు వెచ్చించి కొనుగోలు చేసిన వీటిని ఇత‌రుల‌కు ఇవ్వ‌లేము. క‌నుక ఆ బెడ్ మీద వాడిన పురుపును, దిండునైనా మార్చాలి. త‌రువాత వాటిని సంప్రోక్ష‌ణ చేయ‌డం వ‌ల్ల మ‌ర‌ణించిన వ్య‌క్తి తాలూకు దోషాలు తొల‌గిపోతాయి. అదేవిధంగా చాలా మంది పూజా మందిరంలో మ‌ర‌ణించిన వారి ఫోటోల‌ను ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇలా చేయ‌కూడ‌ద‌ని పండితులు చెబుతున్నారు.

భ‌గ‌వంతుడి కోసం నిర్మించిన మందిరంలో వారి ఫోటోల‌ను ఉంచ‌కూడ‌దు. అలాగే పూజా మందిరం పైన కూడా పితృ దేవ‌త‌ల ఫోటోల‌వారి కోసం మ‌రొక మందిరాన్ని నిర్మించి అందులో వారి ఫోటోల‌ను పూజించుకోవ‌చ్చు. అదే విధంగా మ‌ర‌ణించిన వారి ఫోటోల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారానికి ఎదురుగా ఉంచ‌కూడ‌దు. ఇంట్లో ఒక ప‌క్క‌కు ఉంచాలి. మ‌ర‌నించిన వారి జ్ఞాప‌కాలు మ‌న‌కు ప‌దే ప‌దే గుర్తుకు వ‌చ్చి మ‌నం బాధ‌ప‌డుతుంటాం క‌నుక వారి ఫోటోల‌ను ఒక ప‌క్క‌క‌ని ఉంచాలి. మ‌ర‌ణించిన వారిపై ఆరాధన భావాన్ని క‌లిగి ఉండి వారిని మ‌న మ‌న‌సులో ఆరాధాస్తూ ఉంటే వారి ఫోటోల‌ను ఇంట్లో పెట్టుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు.

Share
D

Recent Posts