Aloe Vera For Long Hair : క‌ల‌బంద‌లో ఇది క‌లిపి రాస్తే.. కేవ‌లం 10 రోజుల్లోనే మీ జుట్టు పొడ‌వుగా, దృఢంగా పెరుగుతుంది..!

Aloe Vera For Long Hair : జుట్టు అందంగా, ఒత్తుగా, పొడుగ్గా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. జుట్టు అందంగా ఉండ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తుంటారు. ఎంతో ఖ‌రీదైన నూనెల‌ను, షాంపుల‌ను, కండిష‌న‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. కానీ స‌హ‌జ సిద్ద‌మైన చిట్కాల‌ను వాడితేనే ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టును బ‌లంగా, పొడ‌వుగా పెంచే ఒక ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి మ‌న‌కు ముఖ్యంగా కావల్సింది క‌ల‌బంద‌. దీనిలో ఉండే ప్రోటీయో లైటిక్ ఎంజైమ్ లు మాడుపై ఉండే పాడైపోయిన క‌ణాల‌ను బాగు చేస్తాయి.

అంతేకాకుండా జుట్టు కుదుళ్ల‌ను బ‌లంగా త‌యారు చేస్తాయి. కుదుళ్ల ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తాయి. జుట్టు త్వ‌ర‌గా పెరిగేలా చేయ‌డంలో క‌ల‌బంద ఎంత‌గానో స‌హాయప‌డుతుంది. దీని కోసం ముందుగా క‌ల‌బంద గుజ్జును తీసుకుని దానిపై ఉండే పచ్చ‌సొన‌ను నీటితో క‌డిగి వేయాలి. త‌రువాత ఈ గుజ్జును ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నీటిని పోసి మెత్త‌గా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత దీనిలో ఒక టీ స్పూన్ ఉసిరి నూనెను వేసి క‌ల‌పాలి. ఉసిరి నూనెను ఉప‌యోగించడం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది. జుట్టు రాల‌డం, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. త‌రువాత ఈ మిశ్ర‌మంలో ఒక టీ స్పూన్ బాదం నూనెను వేసి బాగా క‌ల‌పాలి.

Aloe Vera For Long Hair very effective and natural method
Aloe Vera For Long Hair

బాదం నూనెలో ఉండే విట‌మిన్ ఇ జుట్టు పెరుగుద‌ల‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించి జుట్టును ఆరోగ్యంగా, కాంతివంతంగా చేసే శ‌క్తి కూడా ఈ బాదం నూనెకు ఉంది. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని చేత్తో కానీ దూదితో కానీ జుట్టుకు బాగా ప‌ట్టించాలి. త‌రువాత ఈ మిశ్ర‌మం కుదుళ్ల‌లోకి ఇంకేలా సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. ఈ చిట్కా త‌యారీలో వాడిన క‌ల‌బంద గుజ్జు, ఉసిరి నూనె, బాదం నూనెలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి.

ఇవి మ‌న జుట్టుకు చ‌క్క‌టి పోష‌ణ‌ను అందించి జుట్టు బ‌లంగా , అందంగా త‌యారు చేస్తాయి. ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించిన రెండు గంట‌ల త‌రువాత ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒక‌సారి ఒక చిట్కాను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు కుదుళ్లు బ‌లంగా, ఆరోగ్య‌వంతంగా త‌యార‌వుతాయి. చుండ్రు స‌మ‌స్య నుండి విముక్తి క‌లుగుతుంది. జుట్టు మృదువుగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది.

Share
D

Recent Posts