lifestyle

సాయంత్రం 6 దాటాక ఈ ప‌నుల‌ను అస‌లు చేయ‌కూడ‌దు..!

పూర్వ‌కాలం నుంచి మన పెద్ద‌లు కొన్ని ఆచారాలు, సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ వ‌స్తున్నారు. అవ‌న్నీ సైన్స్‌తో ఏదో ఒక ర‌కంగా ముడిప‌డి ఉన్న‌వే. అయితే కొంద‌రు మాత్రం వీటిని మూఢ విశ్వాసాలుగా కొట్టి పారేస్తుంటారు. ఇత‌రుల‌కు లేదా మ‌న‌కు ఎలాంటి హాని క‌ల‌గ‌న‌ప్పుడు, డ‌బ్బుల‌తో ముడిప‌డి లేప‌ప్పుడు ఎలాంటి విశ్వాసాల‌ను అయినా స‌రే న‌మ్మ‌వ‌చ్చ‌ని పెద్ద‌లు చెబుతున్నారు. ఇక అలాంటి వాటిల్లో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన త‌రువాత ఏమేం ప‌నులు చేయ‌కూడ‌దో ఇప్పుడు చూద్దాం.

సాయంత్రం 6 గంట‌లు దాటిన త‌రువాత చేయ‌కూడ‌ని కొన్ని ప‌నులు ఉన్నాయి. అవేమిటంటే.. సాయంత్రం 6 దాటితే సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇంటికి తెచ్చుకోరాదు. అవి శ‌ని స్థానాలుగా చెప్ప‌బ‌డుతున్నాయి. ఇక సాయంత్రం అయిన త‌రువాత పెరుగు, ఊర‌గాయ‌లు, మిర‌ప పొడి ఎవ‌రికీ ఇవ్వ‌రాదు. వీటిని ల‌క్ష్మీస్థానాల‌ని అంటారు. శ‌నివారం చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసం కొని ఇంటికి తేరాదు.

do not do these works after sunset know why

ఇక ఇంటిని, ఇంటి ప‌రిస‌రాల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అలా ఉంచితేనే ల‌క్ష్మీదేవికి ఇష్టం. లేదంటే ఆమె వెళ్లిపోతుంది. అప‌రిశుభ్రంగా ఉన్న ప్ర‌దేశాల్లో ద‌రిద్ర దేవ‌త ఉంటుంది. క‌నుక ఇంటిని ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అలాగే పూజ గ‌దిలో వెంట్రుక‌లు ప‌డ‌కుండా చూడాలి. లేదంటే దేవ‌త‌ల‌కు మ‌నం పెట్టే నేవేద్యం చేర‌ద‌ని చెబుతారు. ఇక ఇంటిని క‌డిగే నీటిలో ఉప్పు వేసి క‌డ‌గాలి. దీంతో ఇల్లు శుభ్ర‌మ‌వ‌డ‌మే కాదు.. దుష్ట‌శక్తులు, దిష్టి అనేవి ఉండ‌వు.

Admin

Recent Posts