Rice : ప్రస్తుత కాలంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. చిన్న చిన్న పరిహారాలను పాటించడం వల్ల మనం ఈ సమస్యల నుండి బయట పడవచ్చు. చాలా మంది ఎలా పడితే అలా అన్నాన్ని తింటూ ఉంటారు. మనం అన్నాన్ని అన్నపూర్ణా దేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. అలాంటి అన్నపూర్ణా దేవికి కోపాన్ని తెప్పిస్తే ఆ తల్లి మనకు అన్నం దొరకకుండా చేయడమే కాకుండా మనల్ని దరిద్రులను చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అన్నాన్ని తినేటప్పుడు, తిన్న తరువాత కొన్ని నియమ నింబధలను పాటించడం వల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
అన్నం తినేటప్పుడు కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అన్నాన్ని ఒకే దగ్గర కూర్చొని తినాలి. కొందరు అటూ ఇటూ తిరుగుతూ తింటుంటారు. అలా అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అలా తిరుగుతూ తినడం వల్ల అన్నపూర్ణా దేవికి కోపం వచ్చి మనల్ని దరిద్రులను చేస్తుందని వారు చెబుతున్నారు. అన్నం తినేటప్పుడు పళ్లెం చుట్టూ మెతుకులు పడకుండా చూసుకోవాలి. ఒక వేళ మెతుకులు పడితే వాటిని తక్షణమే తీసి వేయాలి. పొరపాటున కూడా అన్నాన్ని కాళ్లతో తొక్క కూడదు.
అన్నం తిన్న తరువాత తిన్న పళ్లెంలో చేతులు కడగకూడదు. అలా చేయడం వల్ల అన్నపూర్ణా దేవికి కోపం వచ్చి మనల్ని దరిద్రులను చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చాలా మంది అన్నం తిన్న ప్లేట్ ఎండిపోయే వరకు కడగరు. మనం అన్నం తిన్న ప్లేట్ ఎండిపోకుండా దానిలో నీళ్లను పోసి ఉంచాలి లేదా వెంటనే కడిగేయాలి. చాలా మంది రాత్రి భోజనం చేసిన ప్లేట్ ను ఉదయం శుభ్రం చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదని రాత్రి భోజనం చేసిన ప్లేట్ ను రాత్రే శుభ్రం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ నియమాలను పాటించడం వల్ల అన్నపూర్ణా దేవి అనుగ్రహం మన మీద ఉంటుందని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మనం పొందవచ్చని పురాణాలు తెలియజేస్తున్నాయి.