vastu

Vehicle : వాహ‌నాన్ని కొనేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌వ‌ద్దు..!

Vehicle : ఈరోజుల్లో ఎక్కువమంది కార్లు, టూవీల‌ర్ల‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సొంత వాహనం కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. టూవీల‌ర్‌ అయినా లేదంటే కార్ అయినా సరే చాలామంది కష్టపడి కొనుక్కుంటూ ఉంటారు. ఆ వాహనాన్ని కొనుక్కోవాలి, ఈ వాహనాన్ని కొనుక్కోవాలని చాలా మంది అనుకుంటారు. దానిని కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే వాహనాన్ని కొనేటప్పుడు ఎటువంటి విషయాలని ఆచరించాలి, వేటిని గుర్తు పెట్టుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పుడైనా సరే కొత్త వాహనాలని కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కొన్ని ప్రత్యేక వాస్తు నియమాలను పాటించాలి. అప్పుడే జీవితంలో ఆనందం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు వాటిని పాటించకపోతే అనేక సమస్యలు వస్తాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు వాస్తు నియమాలని పాటిస్తే అంతా మంచే జరుగుతుంది. చక్కటి ఫలితం ఉంటుంది.

do not make any mistakes while buying vehicle

వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆరోజు మంచి రోజా కాదా అనేది చూసుకుని ఆ తర్వాత మాత్రమే వాహనాన్ని కొనుగోలు చేయాలి. పౌర్ణమి నాడు లేదంటే పౌర్ణమికి పది రోజులు ముందు, లేదంటే 10 రోజుల తర్వాత ఏదైనా మంచి రోజు చూసుకుని కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది. పౌర్ణమి తర్వాత 11వ‌ రోజు నుండి 15వ రోజు వరకు వాహనాలని కొనుగోలు చేయకూడదు. శనివారం అస్సలు కొత్త వాహనాన్ని కొనకూడదు. అమావాస్య నాడు కూడా అసలు కొనకూడదు. అయితే ఎవరికి నచ్చిన వాహనాన్ని వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎవరికి నచ్చిన రంగుల్ని వాళ్ళు ఎంపిక చేసుకుంటూ ఉంటారు.

తెలుపు, వెండి రంగు, లేత రంగులు శుభప్రదంగా పరిగణించబడతాయి. అటువంటి వాటిని కొనుగోలు చేస్తే మంచిది. ఇవి సానుకూలత, స్వచ్ఛతకు చిహ్నం. మేషరాశి వాళ్ళకి ఎరుపు లేదంటే మెరూన్ రంగు మంచిది. ఇలా మీరు చూసుకుని మీరు రాశిని బట్టి కొనుగోలు చేయవచ్చు. అలాగే మీరు వాహనం పెట్టే చోటు ఎప్పుడూ వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. సులువుగా లోపలికి, బయటికి తీసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పార్కింగ్ ప్లేస్ ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. సానుకూల శక్తి కలగాలంటే వెలుతురు ఉండే బహిరంగ ప్రదేశంలో పార్కింగ్ చేయడం మంచిది.

Admin

Recent Posts