lifestyle

Sleep : ఇలా అస్సలు నిద్రపోవద్దు.. పిశాచాలు ఆవహిస్తాయి..!

Sleep : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి. అదే విధంగా కొన్ని రకాల తప్పులు చేయకుండా చూసుకోవాలి. పొరపాటున కూడా ఇటువంటి తప్పుల్ని చేయకండి. ఈ తప్పులు చేస్తే అనారోగ్య సమస్యలు కచ్చితంగా వస్తాయి. ప్రతి రోజు కూడా సమయానికి భోజనం తీసుకోవాలి. ఆకలి వేసినప్పుడు ఆకలిని అస్సలు ఆపకూడదు. అదే విధంగా దాహాన్ని కూడా అస్సలు ఆపుకోకూడదు. ఏ వేగాన్ని కూడా బలవంతంగా ఆపకూడదు. అప్పుడు అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి.

ప్రతి రోజు సూర్యభగవానుడుని ఉదయం 4:30 నుండి 6:00 లోగా పూజించడం మంచిది. ఈ సమయమే శ్రీరాముడికి, వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టం. ఉదయం 6:00 నుండి 7:30 వరకు శివుడిని, దుర్గాదేవిని కొలిస్తే చక్కటి ఫలితం కనబడుతుంది. మంచి జరుగుతుంది. పుణ్యం వస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకి ఆంజనేయ స్వామిని పూజిస్తే, ఆంజనేయస్వామి కృపకు మరింత పాత్రులు కాగలరు. రాహువుని సాయంత్రం మూడు గంటలకి పూజిస్తే చక్కటి ఫలితం కనబడుతుంది.

do not sleep like this or else ghosts will posses

సాయంత్రం సమయంలో శివుడిని పూజిస్తే మంచిది. లక్ష్మీదేవిని సాయంత్రం 6 నుండి రాత్రి 9 వరకు పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. తెల్లవారుజామున మూడు గంటలకి మహావిష్ణువుని పూజిస్తే వైకుంఠ వాసుడి దయ మీకు బాగా లభిస్తుంది. పెద్దలు ఎడమ వైపుకు తిరిగి పడుకుంటే మంచిది. పెద్దల‌ మాటల్లో ఎంతో ఆరోగ్య సత్యం కూడా ఉంటుంది.

ఆకలి వేసినప్పుడు నీళ్లు తాగకండి. తల భాగము శరీరభాగం కంటే దిగువ‌లో ఉంచుకుని నిద్రించకూడదు. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేదంటే రకరకాల సమస్యలు కలుగుతాయి. నిద్రపోవడానికి కూడా నియమాలు వున్నాయి. కుడి వైపుకి తిరిగి నిద్రపోతే పిశాచాలు ఆవహిస్తాయి కూడా. కాబట్టి ఎడమ వైపుకే తిరిగి నిద్రపోండి. ఎప్పుడూ కుడి వైపుకి తిరిగి నిద్రపోవద్దు. కుడివైపుకి తిరిగి నిద్రపోతే పీడ కలలు, కలత నిద్ర వ‌స్తాయి. తిన్న ఆహారం జీర్ణం అవ్వాలంటే ఎడమ వైపుకి తిరిగి నిద్రపోతే మంచిది. దాహం వేసినప్పుడు అస్సలు ఆహారాన్ని తినకండి.

Admin

Recent Posts