lifestyle

Bottle Backside : బాటిల్స్ వెనుక వైపు ఇలా లోతుగా ఎందుకుంటాయో తెలుసా..? లాజిక్ ఉంది మ‌రి..!

Bottle Backside : సాధారణంగా ఏ బాటిల్ అయినా వెనుక భాగం కాస్త లోతుగా ఉంటుంది. గ్లాస్ బాటిల్ అయినా పచ్చడిజార్ అయినా, ఆఖరికి వాటర్ బాటిల్ అయినా.. ఇలా ఏ బాటిల్‌కు అయినా వెనుక భాగం కాస్త లోపలికి అదిమి ఉంటుంది. ఎందుకు ఇలా అనే ప్రశ్న మీలో ఉత్పన్నం అయిందా..? అయితే చాలా మందికి బాటిల్ నిలబడడానికి కావాల్సిన స్థిరత్వం కోసం అనే సమాధానమిస్తుంటారు. యస్.. అది కరెక్టే అయినప్పటికీ.. కేవలం ఆ ఒక్కటే దీనికి రీజన్ కాదు. ఇలాంటి మరికొన్ని రీజన్లు ఉన్నాయి, కావాలంటే ఓ సారి చూడండి.

బాటిల్ పరిమాణం పెద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది, అందులో పదార్థం తక్కువగా ఉన్నప్పటికీ, తక్కువగా ఉందనే డౌట్ మనకు రాదు. ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉందన్న భ్రమ కలుగుతుంది. లోతు ఉండటం వలన జాడీలు, సీసాలు పగిలిపోకుండా భద్రంగా ఉంటాయి. అధిక పీడనం కలిగిన సీసాలు, వైన్ బాటిల్స్ పగలకుండా రక్షిస్తుంది. ఇక అందులో ఉండే పదార్థాన్ని తాజాగా ఉండేలా ఉంచుతుంది. ఇలా ఉండటంతో బాటిల్ చుట్టూ పేరుకుపోయిన అవక్షేపాలను ఇతర పదార్థాలతో కలవకుండా ఆ పదార్థం పాడవకుండా చేస్తుంది. అందుకే మనం ఉపయోగించే ఆవకాయ జాడీలు, వైన్ బాటిల్స్ నొక్కు ఎక్కువగా ఉంటాయి.

why bottles have this type of structure

అటువంటి బాటిల్స్ ను శుభ్రపరచుకోవడం చాలా ఈజీ. నీటిని ఎక్కువగా చుట్టు పక్కల చేర్చి సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ బాటిల్స్ ముందు భాగం చాలా గట్టిగా ఉండటంతో వాటి మధ్య ఉపరితలం సీసాలలో ఉన్న పదార్థాలను దగ్గర చేస్తుంది. వైన్, ఐస్, ఏదైనా పానీయం చల్లగా ఉండేలా చేస్తుంది. వైన్ బాటిల్స్ ను ఐస్ బకెట్స్ లో ఉంచితే దాని ఉపరితలం వలన వైన్ బాటిల్స్ మిగతా వాటితో పోల్చితే చాలా తొందరగా చల్లబడతాయి.

సీసాలను ఇలా ఒకదానిపై ఒకటి అమర్చడం వలన ఎటువంటి ప్రతిధ్వని రాకుండా, ఆ సీసాలు పగిలిపోకుండా ఉండేందుకు డెంట్స్ ఉపకరిస్తాయి. అందుకే రవాణా సమయంలో ఒక చోటు నుండి మరో చోటుకి తీసుకెళ్లేటప్పుడు ఈ విధంగా అమర్చి తీసుకెళతారు. లోతు ఉండడం వల్ల బాటిల్ అధిక స్థిరత్వంగా ఉండి కిందపడకుండా ఉంటుంది. అందుక‌నే బాటిల్స్‌కు లేదా సీసాల‌కు కింది వైపు ఇలా లోతుగా ఉంటుంది.

Admin

Recent Posts