వార్త‌లు

ఎన్ని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడి చేసినా ఏమీ కాదు.. ఎందుకంటే..?

ఇజ్రాయెల్‌ పేరు చెబితే మ‌నంద‌రికి తొలుత గుర్తుకు వ‌చ్చేది దుర్భేద్యమైన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ.పాలస్తీనా, హెజ్ బొల్లా, లెబనాన్ వాటి దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ తో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంది.2026లో హెజ్ బొల్లా దాడుల్లో భారీ ప్రాణనష్టం చవిచూసిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తయారీకి నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా అమెరికా సాయంతో పని మొదలుపెట్టింది. 2008నాటికి టమిర్ క్షిపణులను పరీక్షించింది.. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. ఫైనల్ గా 2011లో పూర్తిస్థాయి ఐరన్ డోమ్ ను అందుబాటులోకి తెచ్చింది.

ప్ర‌త్యర్థులు వందలాది రాకెట్లు ప్రయోగిస్తున్నా ఉక్కు కవచంలా ఆ దాడులను అది అడ్డుకొంటోంది. ఇజ్రాయెల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ మూడు దశల్లో పనిచేస్తుంది. అవుటర్‌ లేయర్‌లో యారో-2, యారో-3 క్షిపణి వ్యవస్థలు ఉంటాయి. ఇవి వేలాది కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే క్షిపణులను అడ్డుకుంటాయి. అంతేకాకుండా వాటి నుంచి వెలువడే శకలాల ముప్పును నివారిస్తాయి. మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థగా డేవిడ్‌ స్లింగ్‌ పనిచేస్తుంది. ఇది 100 నుంచి 200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూల్చివేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇజ్రాయెల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలో ఐరన్ డోమ్ వ్యవస్థ చివరిది. ఇది ఇప్పటివరకు హెజ్‌బొల్లా, హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్లను, క్షిపణులను సమర్థంగా అడ్డుకుని రక్షణ కల్పించింది.

do you know about Israel defensive system

వాస్తవానికి ఇజ్రాయేల్ డిఫెన్స్ వ్యవస్థ వివిధ దశల్లో పనిచేస్తుంది. ఇందులో ప్రధానంగా మూడు దశలు ఉంటాయి. ఇందులో యూరో-2, యూరో-3 సిస్టం లను బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగిస్తారు. ఇవి అంతరిక్షంలోనే వాటిని పేల్చేస్తుంది. అనంతరం డేవింగ్ స్లింగ్ మద్యశ్రేణి రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. దీన్ని 100 నుంచి 200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోడానికి వాడతారు. ఇదే సమయంలో యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చడంలో దీనిది కీలక పాత్రగా ఉంటుంది. ఈ సమయంలో చిట్టవిచరి దశలో ఐరన్ డోమ్ ఉంటుంది. దీన్ని స్థానికంగా కిప్పాట్ బర్జెల్ గా వ్యవహరిస్తరు. దీనిలో రాడార్, కంట్రోల్ సెంటర్, మిసైల్ బ్యాటరీ ఉంటాయి. వీటిలో దూసుకొస్తున్న ముప్పును పసిగట్టడం రాడార్ పని. ఆ ముప్పు నేలను ఎక్కడ తాకుతుందో అంచనా వేస్తుంది. అది నేలపై పడే చోట ఎలాంటి నిర్మాణాలు లేకపోతే.. వదిలేస్తుంది. ఒకవేళ ఆ ముప్పు జనావాసాలపై పడేట్టు ఉంటే.. వెంటనే రాకెట్ ను ప్రయోగించి దాన్ని ధ్వంసం చేస్తుంది. ఇలా ప్రతీ ఐరన్ డోమ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు ఉంటాయి. ఒక్కోటి 10 సెకన్లలో 20 క్షిపణులను ప్రయోగించగలవు. అత్యధిక ముప్పులను ఏకకాలంలో ఎదుర్కొనేలా దీనిని రూపొందించారు.

Sam

Recent Posts