technology

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంట‌నే తీసేయండి..!

స్మార్ట్ ఫోన్ల యూజ‌ర్లు ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటున్న‌ప్ప‌టికీ హ్యాక‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త వైర‌స్‌ల‌ను క్రియేట్ చేసి ఫోన్ల‌లోకి వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. తాజాగా మ‌రో వైర‌స్ పెద్ద ఎత్తున ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు ఇన్‌ఫెక్ట్ అవుతున్న‌ట్లు గుర్తించారు. ఈ క్ర‌మంలోనే దాదాపుగా 1.1 కోట్ల ఆండ్రాయిడ్ డివైస్‌ల‌కు ఈ కొత్త వైర‌స్ సోకింద‌ని టెక్ నిపుణులు చెబుతున్నారు. వాస్త‌వానికి నెక్రో ట్రోజాన్ గా పిల‌వ‌బ‌డుతున్న ఈ వైరస్ పాత‌దే. 2019లోనే దీన్ని గుర్తించారు. కానీ ఇప్పుడు మళ్లీ ఈ వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని చెబుతున్నారు.

వుటా కెమెరా, మ్యాక్స్ బ్రౌజ‌ర్ అనే రెండు యాప్‌ల‌కు కూడా ఈ వైర‌స్ ఇన్‌ఫెక్ట్ అయిన‌ట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. క‌నుక ఈ రెండు యాప్స్‌ను క‌నుక మీరు వాడుతుంటే వెంట‌నే వీటిని అన్ ఇన్‌స్టాల్ చేయండి. లేదా అప్‌డేట్ చేయండి. ఈ యాప్స్‌ను ఇప్ప‌టికే కొన్ని కోట్ల సంఖ్య‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌డం విశేషం. అందువ‌ల్ల ఈ యాప్‌లు ఎవ‌రి ఫోన్ లో అయినా ఉంటే వెంట‌నే తీసేయాల‌ని నిపుణులు చెబుతున్నారు.

if you have these 2 apps in your phone remove them immediately

ఇక చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా థ‌ర్డ్ పార్టీ స్టోర్‌లు లేదా ఇత‌ర సైట్ల నుంచి యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తుంటారు. అలాంటి యాప్‌ల‌లోనూ ఈ వైర‌స్ ఉండే చాన్స్ ఉంటుంద‌ని, క‌నుక అలా ఇత‌ర సోర్స్‌ల నుంచి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌ద్ద‌ని చెబుతున్నారు. అలాగే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో ఉండే గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనే ఫీచ‌ర్‌ను ఆన్ చేయాల‌ని, దీంతో ఫోన్ సుర‌క్షితంగా ఉంటుంద‌ని సూచిస్తున్నారు.

Admin

Recent Posts