food

ఎంత‌గానో మేలు చేసే జొన్న అంబ‌లి.. ఎలా త‌యారు చేయాలో తెలుసా..?

జొన్నలలో ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి. జొన్నలతో అన్నం వండుకొని తింటారు. అలాగే పిండితో రొట్టెలు, అంబలి వంటివి తయారుచేసుకొని తీసుకోవచ్చు. జొన్నలతో అంబలి ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. జొన్నలను మెత్తని పిండిగా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల జొన్న పిండి వేసి దానిలో గ్లాసున్నర నీటిని పోసి పొయ్యి మీద పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు లేదా సైంధ‌వ లవణం వేసి ఒక నిమిషం అయ్యాక పొయ్యి మీద నుంచి దించి కొంచెం చల్లారాక గ్లాసులో పోసి అరచెక్క నిమ్మరసం, రెండు చిటికెల మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ విధంగా తయారుచేసిన జొన్న అంబలిని ప్రతి రోజూ తీసుకోవచ్చు. లేదా వారంలో మూడు సార్లు తీసుకోవచ్చు.

ఈ జొన్న అంబలిని తాగటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అలాగే అలసట, నీరసం లేకుండా శక్తి ఉండేలా చేస్తుంది. బరువు తగ్గాలని అనుకొనే వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. డయాబెటిస్, రక్తపోటు సమస్యలు ఉన్నవారికి కూడా ఈ అంబలి చాలా సహాయపడుతుంది. శరీరంలో వేడి ఎక్కువ ఉన్నవారిలో వేడి తగ్గించి చలువ చేస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

do you know how to prepare jonna ambali

కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా చేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న జొన్న అంబలి తీసుకొని ప్రయోజనాలను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts