Virat Kohli : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి తన ఫిట్ నెస్‌కు అధిక ప్రాధాన్యతను ఇస్తాడన్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌లు ఆడినా, ఆడకపోయినా.. ఎప్పుడూ జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపిస్తుంటాడు. ఇక తన ఆహారం విషయంలోనూ కోహ్లి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాడు. వివిధ రకాలైన ఆహారాలను రోజూ తీసుకుంటుంటాడు. అందుకనే మైదానంలో ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తాడు. అయితే కోహ్లి ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌కు చెందిన నీళ్లను తాగుతుంటాడు. వాటి ధర ఎంతో.. వాటిని తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
విరాట్ కోహ్లి తాగే నీళ్లు.. ఎవోకస్ (EVOCUS) కంపెనీకి చెందినవి. EVOCUS H2O Black Alkaline Drink అని పిలుస్తారు. ఇవి మినరల్ వాటరే. కానీ అందులో 70కి పైగా సహజసిద్ధమైన మినరల్స్ ఉంటాయి. 8కి పైగా పీహెచ్ విలువను ఈ నీళ్లు కలిగి ఉంటాయి. దీన్నే ఆల్కలైన్ డ్రింక్ అని కూడా పిలుస్తారు. ఇవి అత్యంత ఆరోగ్యకరమైన నీళ్లు. ఇక ఈ నీళ్లు అన్ని ఈ-కామర్స్ సైట్లలోనూ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో బాటిల్‌ను కాకుండా 6, 10, 25.. ఇలా భిన్న రకాల పరిమాణాల్లో బాటిల్స్ ను విక్రయిస్తున్నారు.
ఒక లీటర్ ఎవోకస్ హెచ్2వో బ్లాక్ ఆల్కలైన్ డ్రింక్ ఖరీదు.. రూ.200 గా ఉంది. 500 ఎంఎల్ బాటిల్స్‌లో ఎక్కువగా ఈ నీళ్లను విక్రయిస్తున్నారు. అయితే ఈ నీళ్లను తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
క్రికెటర్లే కాదు.. స్పోర్ట్స్ ఆడేవారు, అథ్లెట్లు ఎవరైనా సరే రోజంతా ఆటలో నిమగ్నమవుతుంటారు. అలాగే ఎక్కువగా వ్యాయామం చేస్తుంటారు. దీంతో వారి శరీరంలో నీరు త్వరగా అయిపోతుంది. కానీ పైన తెలిపిన ఆల్కలైన్ నీళ్లను తాగడం వల్ల శరీరంలో ద్రవాలు చాలా సేపటి వరకు అలాగే ఉంటాయి. దీంతో డీహైడ్రేషన్ రాదు. దప్పిక కాకుండా ఉంటుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు సులభంగా బయటకు పోయి.. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
ఇక క్రీడాకారులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అయినప్పటికీ ఒక్కోసారి కడుపులో అసౌకర్యం కలుగుతుంది. దాన్ని కూడా నివారించేందుకు వారు ఈ ఆల్కలైన్ నీళ్లను తాగుతారు. దీంతో గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి. విరేచనాలు కాకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక ఈ ఆల్కలైన్ నీళ్లను తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో శక్తి ఎక్కువగా లభిస్తుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. శరీరంలో కొవ్వు అనేది ఉండదు. కరిగిపోతుంది. దీని వల్ల ప్లేయర్లు ఫిట్‌గా ఉంటారు. అలాగే మెదడు చురుగ్గా ఉంటుంది. యాక్టివ్‌గా పనిచేస్తుంది. దీనివల్ల ఆలోచనా శక్తి పెరుగుతుంది. క్రీడల్లో రాణిస్తారు. ఇలా ఆల్కలైన్ నీళ్లతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. కనుకనే క్రీడాకారులు, అథ్లెట్లు, సెలబ్రిటీలు ఈ నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు.