వినోదం

Amala : నాగార్జున స‌తీమణి అమ‌ల ఏ దేశానికి చెందిన‌ది.. ఆమె త‌ల్లి ఎవ‌రు, ఏం చేస్తుంటారు..?

Amala : టాలీవుడ్ మ‌న్మ‌థుడిగా పేరు తెచ్చుకొని అమ్మాయిల హృద‌యాలు గ‌ల్లంతు చేసిన హీరో నాగార్జున‌. ఆయ‌న స‌తీమ‌ణి అమ‌ల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నాగార్జున‌తో క‌లిసి ప‌లు చిత్రాల‌లో న‌టించిన అమ‌ల ఆయ‌న‌తో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకొని అఖిల్‌కి జ‌న్మ‌నిచ్చింది. నాగార్జున అమ‌ల ఇప్ప‌టికీ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. నాగార్జున హీరోగా నటించిన ‘కిరాయి దాదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమల.. అటు తరువాత వెంకటేష్ తో ‘రక్తతిలకం’ ‘అగ్గిరాముడు’, చిరంజీవి తో ‘రాజా విక్రమార్క’, రాజశేఖర్ తో ‘ఆగ్రహం’.. మళ్ళీ నాగార్జునతో ‘చినబాబు’ ‘శివ’ ‘నిర్ణయం’ ‘ప్రేమ యుద్ధం’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

పెళ్లి త‌ర్వాత పూర్తిగా కుటుంబ జీవితానికి ప‌రిమితం అయింది అమ‌ల‌. అమ‌ల తండ్రి బెంగాలీ కాగా ఆమె త‌ల్లి ఐర్లాండ్ దేశ‌స్తురాలు. అమ‌ల త‌ల్లిదండ్ర‌లు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విధంగా ఆయన నేవీ ఆఫీసర్ గా చేస్తున్న సమయంలో డిప్యూటేషన్ మీద ఖ‌ర‌గ్ పూర్ ఐఐటీలో ప్రొఫెసర్ జాబ్ సంపాదించారు. అమల తల్లి మైహౌ కూడా జాబ్ చేసేది. పెళ్లి తర్వాత వీరిద్దరూ చెన్నై మరియు వైజాగ్ వంటి ప్రదేశాల్లో చాలా కాలం ఉన్నారు.

do you know which country amala belongs to

అయితే నాగార్జున‌కు ముందుగా ద‌గ్గుబాటి వెంక‌టేష్ సోద‌రితో వివాహం జ‌రిగింది. అమ‌ల‌ను ప్రేమించిన వెంట‌నే భార్య‌తో విడాకులు తీసుకొని, అమ‌ల‌ను వివాహం చేసుకున్నారు. అమల.. ‘బ్లూ క్రాస్’ అనే జంతువుల పరిరక్షణ కేంద్రాన్ని స్థాపించి మానవత్వాన్ని చాటుకుంటూ గొప్ప మహిళగా పేరుతెచ్చుకుంది. నాగార్జునని పెళ్లి చేసుకున్న తర్వాత అమల‌ పూర్తిగా హైదరాబాద్ వచ్చేశారు. వివాహం తర్వాత అమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒకే ఒక జీవితం లాంటి రెండు సినిమాల్లో నటించారు. అందులో పాత్రలు కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయని చెప్పొచ్చు.

Admin

Recent Posts