ఆధ్యాత్మికం

Sri Krishna : శ్రీ‌కృష్ణుడు నెమ‌లి ఫించాన్ని ఎందుకు ధ‌రిస్తాడో తెలుసా.? దీని వెనుక ఉన్న క‌థ ఇదే..!

Sri Krishna : శ్రీకృష్ణుడు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. శ్రీకృష్ణుడు ఆయన మాయలతో, లీలలతో అందరినీ ఆకట్టుకునేవాడు. అయితే శ్రీకృష్ణుడు ఎందుకు నెమలి ఫించాన్ని ధరిస్తాడు..? దాని వెనుక కారణం ఏంటి.. అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల్లో కూడా నెమలి ప్రస్తావన ఉంది. మన జాతీయ పక్షిగా నెమలిని గుర్తించడం జరిగింది. పక్షి జాతిలో యోగ విద్య తెలిసినవి కేవలం ఐదు పక్షులు మాత్రమే. శుఖము, హంస, గరుడ, నెమలి అలాగే పావురం. శ్రావస్తి పట్టణ సామంతుడైన పంచవర్ణుడు క్రౌంచపక్షులకి కలిగిన ఆ గాయాల‌ని నయం చేయడానికి వృద్దుడైన రాజుకు యవ్వనాన్ని ప్రసాదిస్తామంటే వద్దంటాడు. మీలానే నేను కూడా ఆకాశంలో విహ‌రించాలని అడుగుతాడు.

అప్పుడు మేము చెప్పబోయే దేవతా మంత్రం ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు నీకు పని చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది చెప్పుకున్నాక చిన్న అందమైన ఈకలు వస్తాయి అని చెప్తారు. ఈ రహస్యం మీ భార్య కి చెప్పవ‌ద్దని అంటుంది. ఓ నాడు ఈ మంత్రప్రభావం చూద్దామని మంత్రాన్ని పఠించగా అందమైన పక్షిగా మారిపోయి ఆనందంగా గెంతులు వేస్తుంటాడు. ఆయన భార్య చూసింది. అప్పటి నుండి కూడా ఆ మంత్రం కోసం భర్తను ఎన్నో విధాలుగా హింసిస్తూ ఉండేది. బాధలు పడలేక చెప్తాడు.

do you know why sri krishna wears peacock feather

ఆ మంత్రాన్ని అధిష్టించిన దేవత అతని భార్యకు బుద్ది చెప్పాలకున్నది. ఆయన భార్య అతిసుందరమైన విహంగంగా మారిపోతున్నానని ఆమె అతి సుందరః అనడానికి బదులు అసుందర అని చెప్తుంది. దీనితో ఆమె ఫించంలేని ఆడనెమలిగా మారిపోయింది. ఇచ్చిన మాట తప్పడంతో ఆ క్రౌంచపక్షులు, ఆ రాజుని శాశ్వతంగా మగనెమలిగా మారాలంటాయి. నెమళ్ళకు వీర్యాన్ని ఊర్ద్వముఖంగా నడిపించ‌గల శక్తి వుంటుంది. జ్జానంలో మనిషి కన్నా తక్కువగా ఉండటం వల్ల, రేతస్సు (వీర్యం) పల్చని జిగురు రూపంలో కళ్ళ నుండి బయటకి వస్తుంది.

అప్పుడు ఆడనెమలిని ఆకర్షిస్తుంది. మదజలం అలానే ఆ వీర్యం ద్వారా ఆడ నెమలికి గర్బం వస్తుంది. నెమలి గర్భం ధరించడం మానసికమైనది. సంభోగ ప్రక్రియ ఏమీ లేదు. నెమళ్ళు అర్ధస్ఖలిత బ్రహ్మచారులు. సృష్టిలో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి ఒక్కటే. పదహారువేలమంది గోపికలు అంత మంది భామలతో అల్లరి చేసేవాడు కృష్ణుడు. ఈ విషయాన్ని తెలిపేందుకు నెమలి ఫించాన్ని ధరిస్తాడు కృష్ణుడు అని పురాణాలు చెబుతున్నాయి.

Admin

Recent Posts