వినోదం

Vishwnath : విశ్వ‌నాథ్ ఖాకీ దుస్తులు ధ‌రిచ‌డం వెన‌క ఉన్న అస‌లు కార‌ణం ఏంటంటే..!

Vishwnath : తెలుగు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు క‌ళాతప‌స్వి కె విశ్వ‌నాథ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అపోలో హాస్పిటల్ లో మరణించిన సంగతి తెలిసిందే.ఈయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి. తెలుగు చిత్ర సీమ‌కి శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలుఅందించారు.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన విశ్వనాథ్ గారు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా ఆణిముత్యంలా ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు.

విశ్వ‌నాథ్ తెర‌కెక్కించే ప్రతి సినిమాలో తెలుగుదనం ఉట్టిపడేలా, సాంప్రదాయ పద్ధతులకు ప్రతీకగా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో చేసిన విశేష సేవలకు గానూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఈయనను వరించింది. ఇదిలా ఉంటే ఈయన చనిపోయాక ఈయన గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలోతెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈయన గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న సోషల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తుంది. విశ్వ‌నాథ్ షూటింగ్ టైంలో ఖాకి దుస్తులు ఎందుకు ధరిస్తారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది.

do you know why vishwanath wear khaki shirt and pant

ఇదే ప్రశ్నని ఓ ఇంటర్వ్యూలో విశ్వనాధ్ ని అడిగితే.. సినిమా అనేది ఒక ఉద్యోగం లాంటిది. దాన్ని మనం చాలా బాధ్యతగా వహించాలి. దానిని ఒక విధిలాగా తీసుకోవాలి, బాధ్యతగా చూపించాలి. అందుకే నేను ప్రతి సినిమా షూటింగ్లో చాలా బాధ్యతగా యూనిఫామ్ వేసుకుని ఉంటాను అంటూ ఆయన సమాధానం చెప్పుకొచ్చారు. సాధారణంగా సెట్స్ లో పని చేసే లైట్ బాయ్స్, పేయింటర్స్ ఖాకీ రంగు దుస్తులనే వేసుకుంటారు.వారు ఖాకీ షర్ట్ తో పాటు నిక్కర్ వేసుకుంటే, విశ్వ‌నాథ్ మాత్రం ఖాకీ ష‌ర్ట్ ప్యాంట్ వేసుకొని ఇన్‌ష‌ర్ట్ చేసుకునే వారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన చాలామంది సినిమా విషయంలో ఆయన డెడికేషన్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

Admin

Recent Posts