Dosakaya Chutney : దోసకాయలతో పచ్చడి ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో కలిపి తింటే సూపర్‌గా ఉంటుంది..!

Dosakaya Chutney : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో దోసకాయలు కూడా ఒకటి. వీటితో మనం అనేక రకాల వంటలను చేస్తుంటాం. అయితే దోసకాయలతో పప్పు, పచ్చడి వంటివి ఎక్కువ చేస్తుంటారు. కానీ దోసకాయ పచ్చడి రుచిగా రావాలంటే మాత్రం అందులో కొన్ని పదార్థాలను కలపాల్సిందే. దీంతో రుచి మరింతగా పెరుగుతుంది. అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ఈ క్రమంలోనే దోసకాయ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దోసకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..

దోసకాయ ముక్కలు – పావు కిలో, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, ధనియాలు – ఒక టీస్పూన్‌, టమాటా – పెద్దది, పచ్చి మిర్చి – పది, గుత్తి వంకాయలు – రెండు, ఉప్పు – చిటికెడు, చింతపండు – చిన్న నిమ్మ పండంత, వెల్లుల్లి రెబ్బలు – ఆరు, జీలకర్ర – పావు స్పూన్‌, పోపు దినుసులు – ఒక స్పూన్‌, కరివేపాకు – పది ఆకులు.

Dosakaya Chutney recipe in telugu make in this method
Dosakaya Chutney

దోసకాయ పచ్చడి తయారీ విధానం..

పాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి వేడి చేసి ధనియాలు, పచ్చి మిర్చి వేసి మూత పెట్టాలి. తర్వాత టమాటా ముక్కలు, ముక్కలుగా తరిగిన వంకాయలు వేయాలి. ఉప్పు వేసి మూత పెట్టాలి. బాగా మగ్గిన తరువాత స్టవ్‌ ఆఫ్‌ చేసి చింతపండు వేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత జార్‌లో వేయాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, పావు స్పూన్‌ జీలకర్ర వేసుకుని గ్రైండ్‌ చేయాలి. పావు వంతు దోసకాయ ముక్కలు వేసి మరీ పేస్ట్‌లా కాకుండా ముక్కలుగా ఉండేట్లు మిక్సీ పట్టాలి.

పోపు కోసం పాన్‌లో టేబుల్‌ స్పూన్‌ నూనె, పావు స్పూన్‌ పోపు దినుసులు, నలగ్గొట్టిన వెల్లుల్లి రెబ్బలను వేయాలి. కొంచెం ఇంగువ, కరివేపాకు, రెండు ఎండు మిర్చి, చిటికెడు పసుపు వేసి సన్నని మంటపై ఫ్రై చేయాలి. పచ్చడిని పోపులో కలపాలి. ఇక మిగిలి ఉన్న దోసకాయ ముక్కలను అందులో కలపాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అవుతుంది. దీన్ని అన్నంలో నెయ్యితో కలిపి తింటుంటే ఎంతో రుచిగా ఉంటుంది. దీని రుచి ముందు చికెన్‌, మటన్‌ రుచి కూడా పనికిరావు అంటారు.

Editor

Recent Posts