Cleaning Tips : మీ ఇంట్లో అంతా త‌ళ‌త‌ళా మెరుస్తూ ఉండాలంటే.. ఈ 10 చిట్కాల‌ను పాటించండి..!

Cleaning Tips : ఇంటిని శుభ్రంగా ఒక్క మ‌ర‌క కూడా లేకుండా దుమ్మ లేకుండా త‌ళ‌త‌ళ మెరిసేలా ఉండేలని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవ‌డానికి అనేక ర‌కాల ప్రయ‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి టైల్ పైన పేరుకుపోయిన మురికి, కిచెన్ లో పేరుకుపోయిన జిడ్డు మ‌న‌ల్ని వెక్కిరిస్తూనే ఉంటాయి. వీటిని తొల‌గించ‌డం కూడా చాలా క‌ష్ట‌మైన ప‌ని అనే చెప్ప‌వ‌చ్చు. అయితే కొన్ని ర‌కాల చిట్కాల‌ను వాడ‌డం వల్ల ఇంటిని మ‌నం చాలా శుభ్రంగా ఉంచుకోవ‌చ్చు. అలాగే ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల ఇంట్లో చ‌క్క‌టి సువాస‌న‌లు వెదజ‌ల్లుతాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇంట్లో ఉండే కిచెన్ ను, కిచెన్ లో ఉండే వ‌స్తువుల‌ను శుభ్రం చేయ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని చెప్ప‌వ‌చ్చు.

ఎందుకంటే కిచెన్ లో ఉండే వ‌స్తువుల‌పై నూనె జిడ్డు ఎక్కువ‌గా పేరుకుపోతూ ఉంటుంది. కిచెన్ లో ఉండే వ‌స్తువుల్లో మైక్రోవేవ్ కూడా ఒక‌టి. దీనికి జిడ్డు మ‌రింత ఎక్కువ‌గా పేరుకు పోతుంది. కా నీ చిన్న చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఈ జిడ్డును చాలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు. దీని కోసం ఒక గిన్నెలో నీటిని పోసి అందులో నిమ్మ‌తొక్క‌ల‌ను వేయాలి. త‌రువాత ఈ గిన్నెను మైక్రోవేవ్ లో ఉంచి 5 నిమిషాల పాటు వేడి చేయాలి. ఇలా వేడి చేసిన త‌రువాత వ‌స్త్రంతో తుడుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మైక్రోవేవ్ చాలా సుల‌భంగా శుభ్ర‌ప‌డుతుంది. అల‌గే ఒవెన్ ను కూడా చాలా సుల‌భంగా శుభ్ర‌ప‌రుచుకోవ‌చ్చు. ఒక గిన్నెలో వంట‌సోడా వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒవెన్ లో ఉండే వ‌స్తువుల‌ను బ‌య‌ట‌కు తీసి ఒవెన్ లో జిడ్డు ఎక్కువ‌గా పేరుకుపోయిన చోట ఈ పేస్ట్ ను రాయాలి.

10 best Cleaning Tips for your home
Cleaning Tips

అయితే ఒవెన్ లో వేడి వ‌చ్చే చోట ఈ పేస్ట్ ను రాయ‌కూడ‌దు. దీనిని ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. మ‌రుసటి రోజు ఒక బాటిలో వెనిగ‌ర్ ను తీసుకుని దానికి స‌మానంగా నీటిని క‌లిపి బేకింగ్ సోడా రాసిన చోట స్ప్రే చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఒవెన్ లో పేరుకుపోయిన జిడ్డు చాలా సుల‌భంగా తొల‌గిపోతుంది. అలాగే ఇంట్లో పేరుకుపోయిన దుమ్మును తొల‌గించ‌డం కూడా చాలా క‌ష్టం. దుమ్ము దులిపేట‌ప్పుడు చాలా మంది అల‌ర్జీకి గురిఅవుతూ ఉంటారు. దుమ్ము దులిపేట‌ప్పుడు దుమ్ము లేవ‌కుండా ఉండ‌డానికి మైక్రో ఫైబ‌ర్ క్లాత్ ను ఉప‌యోగించాలి. వీటిని దుమ్ము అతుక్కుపోతుంది. దీంతో దుమ్మును చాలా సుల‌భంగా తొల‌గించ‌వ‌చ్చు. అలాగే గాజుపాత్ర‌ల‌ను, ఆద్దాల‌పై, గాజు వస్తువుల‌పై ఉండే మ‌ర‌క‌లను కూడా చాలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు. దీని కోసం ఒక స్ప్రే బాటిల్ లో వైట్ వెనిగ‌ర్, నీటిని స‌మానంగా పోసి క‌ల‌పాలి.

త‌రువాత దీనిని అద్దాల‌పై, గాజు వ‌స్తువుల‌పై స్ప్రే చేసి శుభ్రం చేసుకోవాలి. అలాగే ట్యాప్ లు, ష‌వ‌ర్ హెడ్ లు కూడా అప్పుడ‌ప్పుడూ బ్లాక్ అవుతూ ఉంటాయి. వీటి నుండి నీరు స‌రిగ్గా రాదు. అలాంట‌ప్పుడు ఒక క‌వ‌ర్ లో వెనిగ‌ర్ ను తీసుకోవాలి. ఈ వెనిగ‌ర్ ట్యాప్ కు, ష‌వ‌ర్ హెడ్ కు త‌గిలేలా ఉంచి ర‌బ్బ‌రు బ్యాండ్ వేయాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఆ త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ్ల‌ల ట్యూప్ ల‌ల్లో పేరుకుపోయిన మ‌లినాలు తొల‌గిపోయి ట్యాప్ లు శుభ్ర‌ప‌డ‌తాయి. అలాగే టైల్స్ ను శుభ్ర‌ప‌ర‌చ‌డం చాలా క‌ష్టం. దీని కోసం ఒక గిన్నెలో వంట‌సోడా, హైడ్రోజ‌న్ పెరాక్సైడ్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ ను టైల్స్ పై రాసి బ్ర‌ష్ తో రుద్ది శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల టైల్స్ పై పేరుకుపోయిన మురికి తొల‌గిపోతుంది.

అలాగే ఇంట్లో ఉండే చెత్తడ‌బ్బాల నుండి ఎప్పుడూ వాస‌న వ‌స్తూ ఉంటుంది. ఈ వాస‌న రాకుండా ఉండాలంటే ఒక గిన్నెలో వంట‌సోడా, మ‌రియు మంచి వాస‌న వ‌చ్చే యూక‌లిప్ట‌స్, లావెండ‌ర్ వంటి నూనె చుక్క‌లు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ ను ఐస్ ట్రేలో వేసి గట్టిగా అయ్యే వ‌ర‌కు ఆర‌బెట్టాలి. త‌రువాత ఈ క్యూబ్స్ ను క‌వ‌ర్ వేసే ముందు చెత్త‌డ‌బ్బాలో వేసి క‌వ‌ర్ వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చెత్త‌డ‌బ్బా నుండి వాస‌న రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా ఇంటిని శుభ్రంగా, మ‌ర‌క‌లు లేకుండా ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts