Egg Bonda : హోట‌ళ్ల‌లో ల‌భించే ఎగ్ బొండాల‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయొచ్చు..!

Egg Bonda : మ‌న‌కు సాయంత్రం పూట బండ్ల మీద‌, హోటల్స్ లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ఎగ్ బోండా ఒక‌టి. కోడిగుడ్ల‌తో చేసే ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అదే రుచితో అంతే సుల‌భంగా ఈ ఎగ్ బోండాల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. స్ట్రీట్ స్టైల్ లో ఎగ్ బోండాల‌ను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి…త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ బోండా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 6, శ‌న‌గ‌పిండి – అర క‌ప్పు, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – పావు టీ స్పూన్, వంట‌సోడా – రెండు చిటికెలు, నీళ్లు – త‌గినన్ని, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Egg Bonda recipe in telugu how to make them
Egg Bonda

ఎగ్ బోండా త‌యారీ విధానం..

ముందుగా ఉడికించిన కోడిగుడ్ల‌ను నిలువుగా రెండు భాగాలుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, ప‌సుపు, కారం, వంట‌సోడా వేసి క‌లపాలి. త‌రువాత త‌గినన్ని నీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ బ‌జ్జీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత క‌ళాయిలో డీప్ ఫ్రైకు స‌రిప‌డా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క‌ట్ చేసుకున్న కోడిగుడ్డులో ప‌చ్చ సొన పోకుండా నెమ్మ‌దిగా పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఈ బోండాల‌ను వేసిన వెంట‌నే క‌ద‌ప‌కుండా కొద్దిగా కాలిన త‌రువాత క‌ద‌పాలి.

వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత వీటిని మ‌ధ్య‌లోకి క‌ట్ చేసుకుని వాటిపై కొద్దిగా చాట్ మ‌సాలా, జీల‌క‌ర్ర‌, ధ‌నియాల పొడి, కారం చ‌ల్లుకోవాలి. త‌రువాత చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు, కొత్తిమీర చ‌ల్లుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ బోండా త‌యార‌వుతుంది. వీటిని ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా ఎగ్ బోండాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts