Egg Pakoda : పకోడీ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి.. ఉల్లిపాయలతో చేసే పకోడీలు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కలిపి చేసే పకోడీలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎంతో మంది ఇష్టంగా తింటారు. అయితే కోడిగుడ్లతోనూ పకోడీలను తయారు చేయవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ పకోడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2 (పెద్దవి), కోడిగుడ్లు – 2, ఉప్పు – తగినంత, కారం – తగినంత, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, నీళ్లు – తగినన్ని, పచ్చి మిరపకాయలు – 4, అల్లం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – రెండు రెబ్బలు.
ఎగ్ పకోడీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పచ్చి మిరపకాయలను, అల్లం ముక్కలను, కరివేపాకును వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయలను, ఉప్పును, ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి మిర్చి మిశ్రమాన్ని, తగినంత కారాన్ని, కోడిగుడ్లను, శనగ పిండిని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ పకోడీ పిండిలా కలుపుకోవాలి.
తరువాత ఒక కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత పిండిని తగిన పరిమాణంలో తీసుకుంటూ పకోడీల్లా వేసుకోవాలి. ఈ పకోడీలను మధ్యస్థ మంటపై.. కళాయిలో కదిలిస్తూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని టిష్యూను ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ పకోడీలు తయారవుతాయి. వీటిని నేరుగా లేదా టమాట కెచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. తరచూ చేసే పకోడీలకు బదులుగా ఇలా కోడిగుడ్లను వేసి కూడా ఎంతో రుచిగా ఉండే పకోడీలను చేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు.