Egg Rolls : బేక‌రీలలో ల‌భించే ఎగ్ రోల్స్‌ను.. ఎంతో రుచిగా ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Egg Rolls : కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కోడిగుడ్ల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో రుచిగా చేసుకోద‌గిన వంట‌కాల్లో ఎగ్ రోల్స్ కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ల‌భిస్తాయి. ఎగ్ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సుల‌భంగా మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా త‌క్కువ స‌మ‌యంలో రుచిగా, సుల‌భంగా అయ్యేలా ఈ ఎగ్ రోల్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ రోల్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కోడిగుడ్లు – 2, మైదాపిండి – 100 గ్రా., పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, పొడుగ్గా త‌రిగిన కీర‌దోస – 1, గ్రీన్ చిల్లీ సాస్ – అర టేబుల్ స్పూన్, ట‌మాట కిచ‌ప్ – ఒక టేబుల్ స్పూన్, చాట్ మ‌సాలా – ఒక టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – ఒక టేబుల్ స్పూన్.

Egg Rolls recipe in telugu very tasty how to make them
Egg Rolls

ఎగ్ రోల్స్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, నూనె వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత పిండిని ఉండలుగా చేసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో కోడిగుడ్ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, కారం వేసి బాగా క‌లుపుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు ఒక్కో పిండి ఉండ‌ను తీసుకుంటూ పొడి పిండి లేదా నూనె వేసుకుంటూ చ‌పాతీలా వ‌త్తుకోవాలి. ఇలా వ‌త్తుకున్న త‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక దానిపై నూనె రాయాలి. త‌రువాత రోటిని వేసి కాల్చుకోవాలి. దీనిని నూనె వేసుకుంటూ రెండు వైపులా కొద్దిగా కాల్చుకున్న త‌రువాత ఈ రోటీపై ముందుగా సిద్దం చేసుకున్న కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని వేసుకోవాలి.

దీనిని రోటీ అంతా వ‌చ్చేలా స్ప్రెడ్ చేసుకున్న త‌రువాత నూనె వేస్తూ రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రోటీ మ‌ధ్య‌లో కీర‌దోస ముక్క‌లను, ఉల్లిపాయ ముక్క‌ల‌ను ఉంచాలి. త‌రువాత వాటిపై చాట్ మ‌సాలా, చిల్లీ సాస్, ట‌మాట సాస్ చ‌ల్లుకుని రోల్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ రోల్స్ త‌యార‌వుతాయి. వీటిని అల్పాహారంగా, స్నాక్స్ గా లేదా మ‌ధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకి కూడా తిన‌వ‌చ్చు. వీటిని పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటారు. ఈ రోల్స్ త‌యారీలో మైదాపిండికి బ‌దులుగా గోధుమ పిండిని కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.

Share
D

Recent Posts