ఆధ్యాత్మికం

ఈ సూత్రాలని తప్పక పాటించండి.. సంపద పెరుగుతుంది.. లక్ష్మీకటాక్షం కూడా ఉంటుంది..!

ప్రతి ఒక్కరు కూడా డబ్బుతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. డబ్బు కోసం అనేక పద్ధతులని పాటిస్తూ వుంటారు. ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మీదేవి అసలు మీ ఇల్లు దాటి వెళ్ళదు. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలని కోరుకుంటుంటారు. మనం ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి ముఖద్వారం, ఆ ఇంటి వరండా అందంగా కనపడితే ఆ ఇంట్లోకి వెళ్లాలని మనకి కూడా అనిపిస్తుంది.

ధనలక్ష్మికి కూడా అంతే. ధనలక్ష్మికి కూడా అందంగా ఉన్న ఇల్లు అంటేనే ఇష్టం. అటువంటి ఇంట్లోకి మాత్రమే ధనలక్ష్మి వెళ్తుంది. ఇంటి ముఖద్వారం అందంగా ఉండేట్టు చూసుకోవాలి. ఇంట్లో అవసరంలేని వస్తువుల్ని ఉంచకూడదు. అవసరంలేని వస్తువులను ఇంట్లో లేదంటే ఆఫీస్ లో ఉంచడం వలన ధనలక్ష్మి వెళ్ళిపోతుంది. పనికిరాని సామాన్లని, విరిగిపోయిన వాటిని ఇంటి నుండి బయట పెట్టేయాలి.

follow these rules for lakshmi kataksham

రంగురంగు క్రిస్టల్ రాళ్లు ఉన్నట్లయితే డబ్బు ఆకర్షిస్తుంది. మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. క్రిస్టల్ రాళ్లు ఇంట్లో పెట్టి అందంగా అలంకరణ చేయండి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. డబ్బు కూడా పెరుగుతుంది. అలాగే ఏదో ఒక నీటి ప్రవాహం ఉండేట్టు చూసుకోండి. చిన్న జలపాతం వంటి వాటిని పెట్టుకోండి. నీటి ఫ్లో ఎంత ఎక్కువ ఉంటే డబ్బు అంత బాగా వస్తుంది.

కాబట్టి ఇటువంటి వాటిని మీరు కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోండి. అప్పుడు కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. డబ్బుకి వంటగదికి కూడా లింక్ ఉంటుంది. వంటగది అందంగా లేదంటే ఇంట్లోకి డబ్బులు రావు. ఖాళీ అయిపోతాయి. వంట గదిలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఆ ఎనర్జీ డబ్బు వచ్చేట్టు చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ వంటగదిని దేవుడి గదిలా చూసుకోవాలి. శుభ్రంగా ఉంచుకోవాలి. బాగా అలంకరణ చేసుకోవాలి. వంట గదిలో గోడలు ఇవన్నీ కూడా చక్కగా అందంగా ఉండేట్టు చూసుకోవాలి. ఎప్పటికప్పుడు చెత్తని తొలగించి అందంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి వస్తుంది.

Admin

Recent Posts