Flies : మీ ఇంట్లో ఈగ‌లు చాలా ఉన్నాయా.. ఈ చిట్కాల‌ను పాటించి వాటిని త‌రిమేయండి..!

Flies : మ‌న ఇంట్లోకి వ‌చ్చే వివిధ ర‌కాల కీట‌కాల్లో ఈగ‌లు కూడా ఒక‌టి. ఇవి వంట పాత్ర‌ల‌పై, పండ్ల‌పై, కూర‌గాయ‌ల‌పై, వంట చేసే చోట వాలి మ‌న‌కు ఎంతో చికాకును క‌లిగిస్తూ ఉంటాయి. అలాగే ఈగ‌ల ద్వారా వైర‌స్, బ్యాక్టీరియాలు ఒక చోట నుండి మ‌రో చోటుకు వ్యాప్తి చెందుతాయి. ఈగ‌లు అనేక ర‌కాల వ్యాధుల‌ను వ్యాప్తి చేస్తాయి. ఈగ‌ల ద్వారా క‌ల‌రా, వాంతులు, అతిసారం, విరోచ‌నాలు, డ‌యేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఇంట్లోకి ఈగ‌లు రావ‌డానికి గ‌ల కార‌ణాల్లో ఇళ్లు శుభ్రంగా లేక‌పోవ‌డం కూడా ఒక‌టి. ఇంట్లో ఉండే అప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం కార‌ణంగా ఈగ‌లు ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి. ఇంట్లోకి ఈగ‌లు రాకుండా ఉండాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంటి ప‌రిస‌రాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

వీటితో పాటు కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఇంట్లోకి ఈగ‌లు ఎక్కువ‌గా రాకుండా ఉంటాయి. ఇంట్లో ఈగ‌లు ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈగ‌లు ఉన్న చోట క‌ర్పూరాన్ని వెలిగించి పొగ వ‌చ్చేలా చేయాలి. క‌ర్పూరం నుండి వ‌చ్చే పొగ కార‌ణంగా ఇంట్లో ఉండే ఈగ‌లు బ‌య‌ట‌కు పోతాయి. అలాగే తుల‌సి చెట్టును ఇంటి చుట్టు ఉండేలా చూసుకోవాలి. తుల‌సి చెట్టు వ‌చ్చే కార‌ణంగా ఇంట్లోకి, ఇంటి ప‌రిస‌రాల్లో ఈగ‌లు రాకుండా ఉంటాయి. అలాగే నీటిలో కారంపొడి క‌లిపి ఈగ‌లు ఎక్కువ‌గా ఉండే, ఇంటి చుట్టూ స్ప్రే చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే ఈగ‌లు పారిపోతాయి. అలాగే ఒక గిన్నెలో డిష్ వాష‌ర్ లిక్విడ్ ను తీసుకోవాలి.

follow these simple tips to get rid of Flies
Flies

ఇందులో ఆపిల్ సైడ్ వెనిగ‌ర్ వేసి క‌లిపి ఇంట్లోకి ఈగ‌లు వ‌చ్చే చోట ఉంచాలి. ఇలా ఉంచ‌డం వల్ల ఇంట్లోకి ఈగ‌లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అదే విధంగా లావెండ‌ర్, యూక‌లిప్ట‌స్, పిప్ప‌ర్ మెంట్, నిమ్మ‌గ‌డ్డితో త‌యారు చేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ ను వంట గ‌దిలో అలాగే ఈగ‌లు ఎక్కువ‌గా ఉండే చోట స్ప్రే చేయాలి. ఈ స్ప్రే చేయ‌డం వ‌ల్ల ఈ వాస‌న‌కు ఈగ‌లు బ‌య‌ట‌కు పోతాయి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఈగ‌ల బెడ‌ద నుండి స‌హ‌జ సిద్దంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

D

Recent Posts