Mosquitoes And Cockroaches : దోమలు.. మన ఇంట్లో ఉండి మన అనారోగ్యానికి కారణమయ్యే కీటకాల్లో ఇవి కూడా ఒకటి. దోమల కారణంగా మనం ప్రస్తుత కాలంలో చాలా మంది డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి ఎన్ని రకాల కాయిల్స్ ను, రిఫిల్స్ ను వాడినప్పటికి దోమల బెడద నుండి మనం తప్పించుకోలేకపోతున్నాము. అయితే కొన్ని జాగ్రత్తలను పాటించడం వల్ల మనం దోమల బెడద నుండి అలగే బొద్దింకల బెడద నుండి చాలా సులభంగా తప్పించుకోవచ్చు. దోమలు ఇంట్లోకి ఎక్కువగా రాకుండా ఉండాలంటే ముందుగా మనం మన ఇంటి చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి.
అలాగే ఇంట్లో కిచెన్ లో, బాత్ రూమ్ లల్లో కూడా నీటి నిల్వ లేకుండా చేసుకోవాలి. నీరు ఉండే డ్రమ్ములల్లో, డబ్బాలపై మూతలను ఉంచాలి. అలాగే పైపులు, సీలంగ్, అల్మారాలు వంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దోమలు, బొద్దింకలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. అలాగే శనగపిండి, బోరిక్ పౌడర్, పంచదార వేసి బాల్స్ లాగా చేసి ఎండబెట్టాలి. తరువాత వీటిని కూర్చీల కింద, సోఫాల కింద, మూలల దగ్గర ఉంచాలి. ఇలా చేయడం వల్ల బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే సింక్ లల్లో, కాలువలల్లో స్టెయినర్స్ ఉంచాలి. ఇలా చేయడం వల్ల దోమలు, బొద్దింకలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా సాయంత్రం సమయంలో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి.
ఇంట్లో చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. కొబ్బరి బోండాలు, కొబ్బరి చిప్పలను కాల్చి వేయాలి. లేదంటే వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ గడ్డి లేకుండా చూసుకోవాలి. పూల కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కూలర్ లను, ఏసీలను శుభ్రం చేస్తూ ఉండాలి. పిల్లలను వీలైనంత వరకు సాయంత్రం బయట తిరగనీయకూడదు. అలాగే ఎప్పుడూ కూడా శరీరం పూర్తిగా కప్పి ఉంచేలా బట్టలను వేసుకోవాలి. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం దోమలు, బొద్దింకల వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.