ఆధ్యాత్మికం

Ganagapur Dattatreya Temple : ఈ క్షేత్రంలో అడుగు పెడితే చాలు.. సకల పాపాలు పోతాయి.. దెయ్యాలను వదిలిస్తుంది..!

Ganagapur Dattatreya Temple : సాధారణంగా లక్ష్మీ నరసింహస్వామి, కాళికా దేవి, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి.. లాంటి దేవతలు, దేవుళ్లు దుష్ట శక్తులను సంహరించేవారుగా పూజలందుకుంటూ ఉంటారు. వారి ఆలయాలను దర్శిస్తే శరీరంపై ఏవైనా గాలి ఉంటే పోతుందని.. దుష్ట శక్తుల పీడ వదులుతుందని నమ్ముతారు. అయితే వీరే కాదు.. ఇలాంటి ప్రత్యేకత ఉన్న ఆలయం ఒకటుంది. అదే.. శ్రీగురు దత్తాత్రేయ క్షేత్రం. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. దీని ప్రత్యేకతలు, విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా అఫ్జల్‌పూర్‌ తాలూకా భూమా నది ఒడ్డున గనాగపూర్‌ అనే ప్రాంతంలో శ్రీగురు దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామికి చెందిన పాదుకలను దర్శించుకుంటారు. ఇక్కడ ప్రవహించే భీమా, అమరాజా అనే నదుల సంగమం చాలా పవిత్రమైందిగా భావిస్తారు. ఇందులో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈ ఆలయానికి చాలా మంది దుష్టశక్తులను వదిలించుకునేందుకు వస్తుంటారు. ఇక్కడికి వస్తే దెయ్యాలను వదిలించుకోవచ్చని నమ్ముతారు. కొందరు ఈ ఆలయంలోకి రాగానే వింతగా ప్రవర్తిస్తారు. ఏవైనా దుష్ట శక్తులు, గాలి ఉంటే ఈ ఆలయానికి వస్తే పోతాయని చెబుతారు.

Ganagapur Dattatreya Temple visiting this can remove all sins

ఇక ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ చుట్టు పక్కల అనేక దర్శనీయ స్థలాలు కూడా ఉన్నాయి. ఇక్కడి భీమా, అమరాజా నదుల సంగమం వద్ద సంగమేశ్వర ఆలయం ఉంది. దీన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. సంగమంలో స్నానం ఆచరించి దైవాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అలాగే ఇక్కడికి సమీపంలో అష్ట తీర్థాలు ఉన్నాయి. ఇక్కడ కూడా భక్తులు తమ పాపాలను పోగొట్టుకుంటానికి స్నానాలు ఆచరిస్తుంటారు.

ఇక గనాగపూర్‌కు హైదరాబాద్‌ నుంచి వెళ్లాలంటే గుల్బర్గా వరకు ముందుగా వెళ్లాల్సి ఉంటుంది. గుల్బర్గాకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. కేఎస్‌ఆర్‌టీసీ, టీఎస్‌ఆర్‌టీసీ బస్సులను నడుపుతున్నారు. గుల్బర్గా చేరుకున్నాక అక్కడి నుంచి గనాగపూర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి గుల్బర్గాకు రైలు మార్గంలోనూ వెళ్లవచ్చు. బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి కూడా గనాగపూర్‌కు వెళ్లవచ్చు. ఇక ఈ ఆలయంలో నిత్యం అనేక పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ప్రత్యేక సేవలను కూడా నిర్వహిస్తుంటారు. కనుక సేవ వివరాలను తెలుసుకుని వెళితే స్వామి వారిని సులభంగా దర్శించుకోవచ్చు.

Admin

Recent Posts