Godhumapindi Karappusa Mixture : గోధుమ‌పిండితో కార‌ప్పూస మిక్చ‌ర్‌.. ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Godhumapindi Karappusa Mixture : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే మిక్చ‌ర్ వెరైటీల‌లో కార‌పూస మిక్చ‌ర్ కూడా ఒక‌టి. కార‌పూస మిక్చ‌ర్ చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తిన‌డానికి, ఇంటికి అతిధులు వ‌చ్చిన‌ప్పుడు స‌ర్వ్ చేయ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ కార‌పూస మిక్చ‌ర్ ను బ‌య‌ట కొనే ప‌ని లేకుండా మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఒకేసారి ఎక్కువ మొత్తంలో త‌యారు చేసి నిల్వ చేసుకుని ఎప్పుడూ ప‌డితే అప్పుడు దీనిని తిన‌వ‌చ్చు. స్వీట్ షాప్ స్టైల్ కార‌పూస మిక్చ‌ర్ ను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కార‌పూస మిక్చ‌ర్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క‌రివేపాకు – 2 టేబుల్ స్పూన్స్, పుట్నాల ప‌ప్పు – పావు క‌ప్పు, ప‌ల్లీలు – పావు క‌ప్పు, జీడిప‌ప్పు – కొద్దిగా, దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు – 8. మ‌క్క‌టుకులు – అర క‌ప్పు, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్.

Godhumapindi Karappusa Mixture recipe make in this method
Godhumapindi Karappusa Mixture

కార‌పూస త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమ‌పిండి – 2 క‌ప్పులు, బియ్యంపిండి – అర క‌ప్పుప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ఇంగువ – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్.

కార‌పూస మిక్చ‌ర్ త‌యారీ విధానం..

ముందుగా ఒక చిల్లుల గిన్నెను తీసుకుని దానిపై కాట‌న్ వ‌స్త్రాన్ని ఉంచాలి. త‌రువాత గోధుమ‌పిండి, బియ్యంపిండి వేసి అంచుల‌ను మూసివేయాలి. త‌రువాత ఈ పిండిని 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. త‌రువాత పిండిని తీసుకుని మెత్త‌గా చేసుకోవాలి. ఈ పిండిని ఉండ‌లు లేకుండా జ‌ల్లెడ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఉప్పు, ఇంగువ, కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ పిండిని ముర‌కుల గొట్టంలో ఉంచి వేడి వేడి నూనెలో మురుకుల‌ను వ‌త్తుకోవాలి. ఈ మురుకులు వీలైనంత స‌న్న‌గా ఉండేలా చూసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న త‌రువాత అదే నూనెలో క‌రివేపాకు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత పుట్నాల పప్పు, ప‌ల్లీలు, జీడిప‌ప్పు, వెల్లుల్లి రెమ్మ‌లు, మ‌క్క‌టుకుల‌ను కూడా ఒక్కొక్క‌టిగా నూనెలో వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న మురుకుల‌ను ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత వెల్లుల్లి రెమ్మ‌లు, ఉప్పు, కారం వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత వేయించిన మిగిలిన ప‌దార్థాల‌ను వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కార‌పూస మిక్చ‌ర్ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts