Guntur Karam Podi : మంచి ఘాటైన రుచి ఉండే గుంటూరు కారం పొడి.. త‌యారీ ఇలా..!

Guntur Karam Podi : మ‌నం వంటింట్లో వివిధ ర‌కాల కారం పొడుల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన కారం పొడి వెరైటీల‌ల్లో ప‌ల్లికారం పొడి కూడా ఒక‌టి. ప‌ల్లీలు, ఎండుమిర్చి వేసి చేసే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే ఈ కారం పొడి మ‌రింత రుచిగా ఉంటుంది. కూర లేన‌ప్పుడు ఈ కారం పొడితో క‌డుపు నిండుగా భోజ‌నం చేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ ప‌ల్లికారం పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌ల్లి కారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – ఒక క‌ప్పు, నూనె – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 15 నుండి 20, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 15, ఉప్పు – త‌గినంత‌.

Guntur Karam Podi very tasty make like this
Guntur Karam Podi

ప‌ల్లికారం పొడి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఎండుమిర్చి, ధ‌నియాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. వీటిని దోర‌గా వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి జార్ లోకి తీసుకోవాలి. ముందుగా ఎండుమిర్చిని మిక్సీ ప‌ట్టుకున్న త‌రువాత వేయించిన ప‌ల్లీలు, వెల్లుల్లి రెబ్బ‌లు, ఉప్పు వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ కారం పొడి చ‌ల్లారిన త‌రువాత గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌ల్లికారం పొడి త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts