Home Tips : ఇల్లు మంచి సువాస‌న రావాలంటే ఈ చిన్న ట్రిక్‌ను పాటించండి..!

Home Tips : ఇల్లు శుభ్రంగా ఉండ‌డంతో పాటు ఇంట్లో చ‌క్క‌టి వాసన ఉంటే మ‌న‌సుకు మ‌రింత ప్ర‌శాంతంగా, ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. కానీ వంట‌గ‌దిలో, చెత్త‌బుట్ట ఉన్న ప్రాంతంలో అలాగే బాత్ రూంల‌ల్లో ఏదో ఒక వాస‌న వ‌స్తూనే ఉంటుంది. మ‌నం చేసే వంట యొక్క ఘాటైన వాస‌న‌లు, చెత్త వాస‌న ఇలా ఏదో ఒక‌టి మ‌న‌కు ఇబ్బందిని క‌లిగిస్తూనే ఉంటాయి. మ‌నం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచిన‌ప్ప‌టికి కొన్ని సార్లు ఎటువంటి ఫ‌లితం లేకుండా ఉంటుంది. చాలా మంది ఇంట్లో చ‌క్క‌టి వాస‌న రావ‌డానికి రూం ఫ్రెష్ న‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు.

అయితే కొన్నిసార్లు రూం ఫ్రెష్ న‌ర్ లు చ‌క్క‌టి వాస‌న వ‌స్తున్న‌ప్ప‌టికి ఘాటుగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. ఇక బ‌య‌ట ల‌భించే రూం ఫ్రెష్ న‌ర్ ల‌ను వాడే అవ‌స‌రం లేకుండా చాలా త‌క్కువ ఖ‌ర్చులో కూడా మ‌నం ఇంటిని ప‌రిమ‌ళ భ‌రితంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇప్పుడు చెప్పే చిన్న చిట్కాను పాటిస్తే చాలు చాలా త‌క్కువ ఖ‌ర్చులో చాలా సుల‌భంగా మ‌నం ఇంట్లో ఉండే దుర్వాస‌న‌ను తొల‌గించుకోవ‌చ్చు. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం మ‌రియు తేలిక కూడా. మ‌న ద‌గ్గ‌ర రెండంటే రెండు ప‌దార్థాలు ఉంటే చాలు దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం కోసం మ‌నం రాళ్ల ఉప్పును మ‌రియు బ‌ట్ట‌ల‌కు వాడే కంఫ‌ర్ట్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

Home Tips follow these ones to get wonderful smell in your house
Home Tips

దీని కోసం ఒక గిన్నెలో 2 టీ స్పూన్ల రాళ్ల ఉప్పును తీసుకుని అందులో ఒక టీ స్పూన్ కంఫ‌ర్ట్ ను వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ గిన్నెను బాత్ రూం లో, వంట‌గ‌దిలో లేదా ఇంట్లో ఏ చోట‌నైనా ఉంచ‌వ‌చ్చు. మ‌నం వాడిన ఉప్పు క‌రిగే వ‌ర‌కు మంచి వాస‌న వ‌స్తూనే ఉంటుంది. ఉప్పు క‌రిగిన త‌రువాత మ‌ర‌లా అందులో ఉప్పు, కంపర్ట్ వేసి క‌లిపి ఉంచుకుంటే స‌రిపోతుంది. ఈ విధంగా ఈ చిన్న చిట్కాను వాడి మ‌న ఇంటిని ప‌రిమ‌ళ భ‌రితంగా మార్చుకోవ‌చ్చు.

D

Recent Posts