ఆధ్యాత్మికం

Lord Hanuman Vehicle : హ‌నుమంతుడికి ఒంటె వాహ‌న‌మా.. అదెలాగా..?

Lord Hanuman Vehicle : ఆంజనేయ స్వామిని హిందువులు ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షిణాదిన ఆంజనేయస్వామి ఆల‌యాలలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా అరుదనే చెప్పాలి. కొన్ని ప్రదేశాలలో ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహనం ఉంటుంది. ఒంటె ఆంజనేయస్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాథ‌ ఉంది. అదేమిటంటే..

రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వధిస్తాడు. అతడి మృతదేహాన్ని రుష్యముక పర్వతం (నేటి హింపి ప్రాంతం) పై పడేస్తాడు. ఈ సంఘటన వాలి, సుగ్రీవుల మధ్య వైరం రగులుకోవడానికి కారణం అవుతుంది. మరోవైపు వాలి శాపాన్ని పొందేందుకు కారణం అవుతుంది. ఆ రుష్య‌ముఖ పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న మాతాంగ మహాముని దుందుభి మృతదేహాన్ని తాను తపస్సు చేసుకుంటున్న ఆ పర్వతం పైన పడేయడాన్ని చూసి.. వాలి కనుక దృశ్యముఖ పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపిస్తాడు.

how camel became vehicle to lord hanuman

సుగ్రీవుని వాలి చంపడానికి వెంటపడినప్పుడు శాపోదంతం తెలుసన్న సుగ్రీవుడు రుష్యమూక పర్వతానికి వెళ్లి దాక్కుంటాడు. ఆ సమయంలో సుగ్రీవుని చూడడానికి వచ్చిన హనుమంతుడు ఒకరోజు అక్కడే ఉన్న పంపా సరోవరాన్ని తిలకించాలని అనుకుంటాడు. దాంతో మిత్రుడైన హనుమంతుడు పంపా సరోవరం తీరంలో తిరగడానికి అణువుగా ఒంటెను సిద్ధం చేస్తాడు సుగ్రీవుడు. అలా అది ఆయనకు వాహనం అయ్యిందని చెబుతారు.

Admin

Recent Posts