Salt : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉప్పును ఉపయోగిస్తున్నారు. ఉప్పు లేకుండా అసలు ఏ వంటకం పూర్తి కాదు. ఏ కూరలో అయినా సరే ఉప్పు పడాల్సిందే. లేదంటే కూరలు రుచించవు. అయితే ఉప్పు రుచికే కాదు.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కానీ దీన్ని పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. మనకు ప్రస్తుతం లభిస్తున్న ఉప్పులో అయోడిన్ కలపబడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఇలా అయోడైజ్డ్ ఉప్పునే వాడాలని నిబంధన తెచ్చింది. కనుక కంపెనీలు ఉప్పులో అయోడిన్ కలిపి అందిస్తున్నాయి. దీని వల్ల అయోడిన్ శరీరానికి లభిస్తుంది. పోషకాహార లోపం రాకుండా ఉంటుంది.
అయితే ప్రస్తుతం కొన్ని కంపెనీలు అయోడిన్ లేని ఉప్పును లేదా చాలా తక్కువగా అయోడిన్ ఉన్న ఉప్పును విక్రయిస్తున్నాయి. ఇది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చట్టాల ప్రకారం నేరమే అవుతుంది. ఇలా అయోడిన్ కలపకుండా కొన్ని కంపెనీలు ఉప్పును విక్రయిస్తున్నందున మనకు అయోడిన్ సరిగ్గా లభించడం లేదు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే ఉప్పు కల్తీ కూడా అవుతోంది. మార్కెట్‌లో కల్తీ అయిన ఉప్పును బాగా విక్రయిస్తున్నారు. ఏది అసలు ఉప్పు.. ఏది కల్తీ జరిగింది.. అని తెలుసుకోవడం కష్టంగా మారింది.
కల్తీ జరిగిన ఉప్పును తెలుసుకోవాలంటే ఒక చిన్న చిట్కాను పాటించాలి. అదేమిటంటే.. ముందు ఒక బంగాళాదుంపను తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేయాలి. కత్తిరించిన వైపు దుంప ముక్కలపై కొంచెం ఉప్పు వేయాలి. ఒక నిమిషం తరువాత ఆ బంగాళాదుంప ముక్కలపై రెండు చుక్కల నిమ్మరసం వేయాలి. బంగాళాదుంప రంగు మారకపోతే మీరు వాడే అయోడైజ్డ్ ఉప్పు కల్తీ కాలేదని.. అసలుదే అని గుర్తించాలి. ఒకవేళ మీరు వాడేది కల్తీ అయోడైజ్డ్ ఉప్పు అయితే.. ఆ బంగాళాదుంప ముక్క నీలం రంగులోకి మారుతుంది. అంటే.. ఆ ఉప్పులో కల్తీ జరిగిందని గుర్తించాలి. అలాంటి ఉప్పును వాడరాదు. వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఎల్లప్పుడూ అయోడైజ్డ్ ఉప్పునే వాడాల్సి ఉంటుంది.