lifestyle

మ‌నం 100 ఏళ్ల‌కు పైబ‌డి జీవించాలంటే ఏం చేయాలి ?

మ‌నిషి 100 ఏళ్ల‌కు పైబ‌డి జీవించ‌డ‌మంటే.. ప్ర‌స్తుత త‌రుణంలో అది కొంత క‌ష్ట‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే.. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా ఎప్పుడు ఏ అనారోగ్య స‌మ‌స్య వ‌స్తుందో అర్థం కావ‌డం లేదు. దీనికి తోడు అన్నీ కాలుష్య‌మ‌యం అయిపోయాయి. కెమిక‌ల్స్‌తో పండించిన కూర‌గాయ‌లు, పండ్ల‌ను తింటున్నాం. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం స‌మ‌స్య‌లు ఉన్నాయి. దీంతో ప్ర‌స్తుతం 60 నుంచి 70 ఏళ్ల వ‌ర‌కు ఎవ‌రైనా జీవిస్తేనే గొప్ప విష‌యం అయిపోయింది. అయితే 100 ఏళ్ల పైబ‌డి జీవించాలంటే ఏం చేయాలి ? అంటే.. అందుకు ప్ర‌పంచంలో ఈ 5 దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు పాటించే జీవన విధానాన్ని పాటించాలి. దాంతో 100 ఏళ్ల‌కు పైబ‌డి జీవించ‌వ‌చ్చ‌ట‌.

ఇట‌లీలోని సార్డినియా, జ‌పాన్‌లోని ది ఐల్యాండ్స్ ఆఫ్ ఒకిన‌వ‌, కాలిఫోర్నియాలోని లొమా లిండా, కోస్టారికాలోని నికోయా, గ్రీస్‌లోని ఇక‌రియా ప్రాంతాల‌ను బ్లూ జోన్స్ అని వ్య‌వ‌హరిస్తారు. ఈ ప్రాంతాల్లో నివసించే ప్ర‌జ‌లు సుమారుగా 100 ఏళ్ల పైబ‌డే జీవిస్తున్నార‌ట‌. అందుకు కార‌ణం ఈ ప్రాంతాల్లో ఉన్న వారు కామ‌న్‌గా పాటించే జీవ‌న విధానం ఒక‌టుంది. దాంతోనే వారు అంత ఎక్కువ కాలం జీవించ‌గలుగుతున్నార‌ట‌. మ‌రి ఆ ప్రాంత‌వాసులు పాటించే ఆ లైఫ్ స్టైల్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

how to live over 100 years life

1. ఏ వ్య‌క్తి అయినా 100 ఏళ్ల‌కు పైబ‌డి జీవించాలంటే ముందుగా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇక కుటుంబ స‌భ్యులు, స‌మాజంతో చ‌క్క‌ని అనుబంధం క‌లిగి ఉండాలి.

2. ధూమ‌పానం, మ‌ద్య‌పానం చేయరాదు. కానీ రెడ్ వైన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మ‌న‌ల్ని ఎప్పుడూ య‌వ్వ‌నంగా ఉండేలా చేస్తాయి. వృద్ధాప్య ఛాయ‌ల‌ను ద‌రిచేర‌నీయ‌వు. అయితే రెడ్‌వైన్‌ను మితంగానే తాగాలి.

3. మాంసాహారం మానేయాలి. అవును, మీరు మాంసాహార ప్రియులు అయినా స‌రే.. ఆ ఆహారాన్ని తీసుకోవడం మానేయాల్సిందే. ఎందుకంటే శాకాహార భోజ‌నం తినేవారు మాత్ర‌మే 100 ఏళ్ల‌కు పైబ‌డి బ‌తుకుతార‌ని అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. అలాగే పైన చెప్పిన ఆ 5 ప్రాంతాల వాసులు కామ‌న్‌గా, ఎక్కువ‌గా తినేది శాకాహార‌మే. క‌నుక ఆ ఆహారాన్ని తీసుకుంటే 100 ఏళ్ల‌కు పైబ‌డి జీవించ‌వ‌చ్చు.

4. నిత్యం వ్యాయామం చేయాలి. క‌ఠిన‌త‌ర వ్యాయామం అవ‌స‌రం లేదు. సాధార‌ణ వ్యాయామం అయినా స‌రే.. రోజూ చేయాలి.

5. రోజూ క‌చ్చితంగా 8 గంట‌లు నిద్రించాలి. చాలా త్వ‌ర‌గా ప‌డుకుని త్వ‌ర‌గా నిద్ర లేవాలి.

ఈ జీవ‌న‌శైలి పాటిస్తే ఎవ‌రైనా 100 ఏళ్ల‌కు పైబ‌డి జీవించ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

Admin

Recent Posts