Aloo Gobi : క్యాలిఫ్లవర్ అంటే సహజంగానే చాలా మందికి అంతగా నచ్చదు. దీన్ని వేపుడు లేదా మంచూరియాగా అయితేనే తింటారు. అయితే క్యాలిఫ్లవర్‌ను ఆలుగడ్డలతో కలిపి ఇలా కూరగా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే క్యాలిఫ్లవర్, ఆలుగడ్డలను కలిపి ఆలూ గోబీని ఎలా తయారు చేయాలి, దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నూనె – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర – 1 టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, అల్లం తురుము – 1 టీస్పూన్, బంగాళా దుంపలు – 2 (ఉడికించి తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి), పసుపు – అర టీస్పూన్, మిరపకారం – అర టీస్పూన్, జీలకర్ర పొడి – 1 టీస్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, ఉప్పు – తగినంత, క్యాలిఫ్లవర్ – చిన్నది ఒకటి, కొత్తిమీర తరుగు – 1 టీస్పూన్.
బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం తురుము వేసి వేయించాలి. బంగాళా దుంప ముక్కలను వేసి బాగా కలపాలి. పసుపు, కారం, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు, కరివేపాకు వేసి 6-7 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతుండాలి. క్యాలిఫ్లవర్, కొత్తిమీర తరుగు జత చేసి బాగా కలపాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించి దింపేయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే ఆలుగోబీ రెడీ అవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.