Idli Chutney With Peanuts : ఇడ్లీల్లోకి చ‌ట్నీ ఇలా చేయండి.. బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే లాంటి టేస్ట్ వ‌స్తుంది.. మొత్తం తినేస్తారు..!

Idli Chutney With Peanuts : మ‌నం రోజూ భిన్న ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను త‌యారు చేసి తింటుంటాం. ఇడ్లీలు, దోశ‌లు, వ‌డ‌లు.. ఇలా చేసి తింటాం. ఇంట్లో వీలు కాన‌ప్పుడు బ‌య‌ట తెచ్చుకుని లేదా బ‌య‌టకు వెళ్లి వీటిని తింటాం. అయితే బ‌య‌ట మ‌న‌కు ఇడ్లీల్లోకి ఇచ్చే చ‌ట్నీ ఎంతో రుచిగా ఉంటుంది. కానీ ఇంట్లో మ‌నం అలా త‌యారు చేయ‌లేం. కానీ కాస్త ఓపిక ఉంటే బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే ఇడ్లీ చ‌ట్నీని ఇంట్లోనే మ‌నం ఎంతో సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇడ్లీ చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు లేదా పుట్నాలు – 1 క‌ప్పు, ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు – 7, అల్లం – చిన్న ముక్క‌, కొత్తిమీర – ఒక క‌ట్ట‌, పచ్చి కొబ్బ‌రి ముక్క‌లు – ఒక క‌ప్పు, చింత‌పండు – ఒక రెబ్బ‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, నీళ్లు – త‌గిన‌న్ని, నూనె – 1 టేబుల్ స్పూన్‌, తాళింపు గింజ‌లు – త‌గిన‌న్ని, ఎండు మిర‌ప‌కాయ‌లు – 2, క‌రివేపాకు – 1 రెబ్బ‌.

Idli Chutney With Peanuts recipe in telugu tasty one
Idli Chutney With Peanuts

ఇడ్లీ చ‌ట్నీ త‌యారీ విధానం..

ముందుగా స్టౌ మీద పాన్ పెట్టుకుని అందులో ఒక టీస్పూన్ ఆయిల్‌ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక చిన్న కప్పు పల్లీలు, 7 లేదా 8 పచ్చి మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, పచ్చి మిరపకాయలు కలిపి ఫ్రై చేసుకుంటే మనకి టైమ్ కూడా సేవ్ అవుతుంది. రెండు కూడా సమానంగా వేగి పోతాయి. పచ్చి మిరపకాయలను వేయించుకునేట‌ప్పుడు తుంచుకుని వేసుకోవాలి. లేదంటే పచ్చి మిరపకాయలు పేలి పోతాయి. పల్లీలు, పచ్చి మిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. పచ్చి మిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు.

కొత్తిమీర, అల్లం కూడా వేగిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి. పల్లీలు లేకపోతే పుట్నాల పప్పు వేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఫ్రెష్ గా ఉంటేనే చ‌ట్నీ టేస్ట్ బాగుంటుంది. తర్వాత టేస్ట్ కు తగినంత ఉప్పు, ఒక చిన్న రెబ్బ చింతపండు వేసుకుని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ఉప్పు, గ్లాస్ నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మనం పల్లీలు, పుట్నాలు, కొబ్బరి సమానంగా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. చ‌ట్నీ ని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బ‌ర‌క‌గా చేసుకుంటే బాగుంటుంది.

ఇలా చేసుకున్న చట్నీని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ముందుగా మిక్సీ వేసుకున్న చట్నీ జార్ లో కొద్దిగా నీళ్లు పోసుకుని చ‌ట్నీలో వేసుకుని కలుపుకోవాలి. చట్నీ మీకు పలుచ‌గా లేదా గట్టిగా కావాలంటే వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చ‌ట్నీలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్‌ మీద పాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్‌ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన‌ తర్వాత ఒక టీస్పూన్ తాళింపు గింజలు వేయాలి. రెండు ఎండు మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులను మాడి పోకుండా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తరువాత చట్నీలో వేసుకుని కలుపుకోవాలి. ఈ చట్నీని కొంచెం పలుచ‌గా చేసుకొని ఇడ్లీలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకే కాదు దోశ, వడల్లోకి కూడా ఇది బాగుంటుంది. ఇలా ఇడ్లీ చ‌ట్నీని చేయ‌వ‌చ్చు. దీంతో ఒక్క ఇడ్లీని ఎక్కువే తింటారు.

Editor

Recent Posts