vastu

Vastu Doshalu : ఇంట్లో ఈ వాస్తు దోషాలు ఉంటే.. అనారోగ్యాలు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Vastu Doshalu : వాస్తు ప్రకారం పాటిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. దాంతో సుఖంగా, సంతోషంగా జీవించొచ్చు. మీకు ఒక విషయం తెలుసా..? మన ఇంట్లో కొన్ని వాస్తు దోషాలు మన అనారోగ్యానికి కారణం అవుతాయట. ఈ విషయాన్ని వాస్తు పండితుల స్వయంగా చెప్పారు. వాస్తు దోషం వలన కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు కలగవ‌చ్చని, ఇబ్బందుల‌ పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక మరి ఇప్పుడు వాస్తు దోషాలు ఏంటి అనే విషయాన్ని చూసేద్దాం.

దక్షిణ దిశని తెరిచి ఉంచడం లోపంగా పరిగణించబడింది. ఎందుకంటే ఈ దిశను యమధర్మరాజు దిశగా పరిగణిస్తారు. ఈ దిశని తెరవడం వలన‌ ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుంది. ఇంట్లో వృద్ధుల‌ మీద ఇది ప్రభావం చూపిస్తుంది. దాంతో అనారోగ్య సమస్యలకి గురవుతూ ఉంటారు. దక్షిణ దశ తెరిచి ఉంచడం వలన అకాల మరణం సంభవిస్తుందని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా దక్షిణ దిశని మూసి ఉంచాలి. తెరిచి ఉంచకూడదు.

if vasthu dosham is there family members will fall ill

చాలామంది మంచం కింద చెప్పులు, షూ వంటివి పెట్టేస్తూ ఉంటారు. మంచం కింద అటువంటివి పెట్టకూడదు. పనికిరాని వస్తువుల్ని కూడా మంచం కింద పెడుతూ ఉంటారు. అసలు మంచిది కాదు. ఆ అలవాటు మానుకోవాలి. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇబ్బందులకి గురిచేస్తుంది. కాబట్టి ఈ పొరపాటు కూడా అసలు చేయకండి. వాస్తు ప్రకారం ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానంగా పరిగణించబడింది. పాత రోజుల్లో ఇల్లు మధ్య స్థానంలో బహిరంగ ప్రాంగణం ఉండేది. కానీ ఇప్పుడు అలా నిర్మించడం లేదు.

ఒకవేళ కనుక మీకు ఈ ప్రదేశం లేకపోతే, ఇంటికి ఉత్తరం లేదా తూర్పు వైపున బహిరంగ ప్రాంగణాన్ని నిర్మించుకోండి. పైగా బ్రహ్మ స్థలాన్ని అణచివేసి ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే అనేక వ్యాధులు కలుగుతాయి. అలానే చాలా ఇళ్లల్లో ఈశాన్యంలో పూజ మందిరం ఉంటుంది. ఈ దిశని అసలు మూసి వేయకూడదు. మూసి వేసినట్లయితే ఇంట్లో డబ్బు కొరత ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి.

Admin

Recent Posts