Lord Ganesha : శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః, నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. గజాననం భూధ గణాథి సేవిథం కభిథ జంబూ ఫలసార పక్షిథం, ఉమాసుతం శోక వినాషకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం.
ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదట వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. వినాయకుడిని పూజిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా మన పనులు పూర్తయిపోతాయి. వినాయకుడిని ఆరాధిస్తే అంతా మంచే జరుగుతుంది. శుభం జరుగుతుంది. అయితే వినాయకుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలతో వినాయకుడిని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఓం గం గణపతయే నమః అని వినాయకుడిని పూజిస్తే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కాబట్టి ఇలా మీరు ఆరాధించండి.
ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్.. అని చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకుంటే అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. ఓం హ్రీన్గ్ గ్రీన్గ్ హ్రీన్గ్ అనే మంత్రాన్ని చదవడం వలన ఆరోగ్యంగా యాక్టివ్ గా ఉండొచ్చు. పాజిటివ్ గా ఉండొచ్చు. ప్రశాంతంగా ఉండొచ్చు.
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా అని చెప్పడం వలన చాలా మంచి జరుగుతుంది. పాజిటివిటీ కలుగుతుంది. వికటాయ నమః అనే మంత్రాన్ని చదవడం వలన కష్టాలు తొలగిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు. ధనం పెరుగుతుంది. సంతోషంగా ఉండొచ్చు.
ఇలా ఈ విధంగా మీరు ఈ మంత్రాలని జపిస్తే చక్కటి ఎనర్జీ ఉంటుంది. అనారోగ్య సమస్యలు, కష్టాలు వంటివి తొలగిపోతాయి. సంతోషంగా జీవించొచ్చు. ఇలా అనేక లాభాలను ఈ మంత్రాల వలన పొందొచ్చు. కాబట్టి. ఈసారి వినాయకుడిని ఆరాధించేటప్పుడు కచ్చితంగా వీటిని చదువుకోండి. అప్పుడు చక్కటి ప్రయోజనాలని మీరు పొందవచ్చు.