ఆధ్యాత్మికం

Rudraksha For Children : మీ పిల్ల‌లు చ‌దువుల్లో రాణించాలా.. అయితే ఈ రుద్రాక్ష‌ను వేయండి..!

Rudraksha For Children : ప్రతి ఒక్కరి ఆరాటం తమ పిల్లలు భవిష్యత్ కోసమే. దీనిలో ప్రధానమైనది విద్య. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అమూల్య ధనం ఉన్నత విద్యలను చదివించడమే. అయితే పలు కారణాల వల్ల పిల్లలు చదువులో సరిగా రాణించలేక పోవచ్చు. గ్రహబలాలు సహకరించక పోవచ్చు. సావాస దోషాలు కారణం కావచ్చు. అన్నింటినీ అధిగమించడానికి సంకల్ప బలం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు దైవబలం, దైవిక శక్తుల అవసరం కూడా ఉంటుంది. వాటిలో దైవికబలాలో అత్యంత పవర్‌ఫుల్‌గా పేరొందిన రుద్రాక్షను ధరింపచేయండి.

చదువుల‌లో రాణించాలంటే ఏ రుద్రాక్షను ధరించాలనేది మీ సందేహం కదా.. సాక్షాత్తు బ్రహ్మ స్వరూపంగా పేరొందిన చతుర్ముఖి రుద్రాక్షను ధరింపచేయండి. ఇంకా అవకాశం ఉంటే రెండు చతుర్ముఖి రుద్రాక్షలను, ఒక షణ్ముఖి రుద్రాక్షను కలిపి ధరింపచేయండి. ఈ రెండు రుద్రాక్షల బంధనాన్ని అంటే కాంబినేషన్‌ను సరస్వతి బంధనం అంటారు. దీని వల్ల చదువుకునే పిల్లలకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, రాయడం, చదవడంల‌లో ప్రావీణ్యతలను ఈ కాంబినేషన్ ప్రసాదిస్తుంది. ఒక్క విషయం.. ఏడు సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రం ఒక్క చతుర్ముఖి రుద్రాక్ష సరిపోతుంది. ఏడేండ్ల పై బడినవారికి మాత్రమే పైన చెప్పిన కాంబినేషన్ రుద్రాక్షలను ధరిస్తే తప్పక సరస్వతి కటాక్షం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు.

if you want your kids top in education then wear this rudraksha on them

రుద్రాక్షలను సర్టిఫై చేసినవి తీసుకోండి. అవకాశం ఉంటే ఎవరైనా బంధువులు నేపాల్, ఇండోనేషియాలకు వెళుతుంటే అక్కడ నుంచి తెప్పించుకోండి. లేదా నమ్మకమైన చోట ప్రామాణికమైన సర్టిఫికెట్ ఇచ్చి అమ్మేచోట రుద్రాక్షలను కొనుగోలు చేయండి. వీటిని తీసుకున్న తర్వాతి వాటిని పురోహితులతో అర్చన చేయించండి. వీలైతే రుద్రాభిషేకం ఆవుపాలతో చేయించి మీ పిల్లలకు తారాబలం కలిసినరోజు వారం, వర్జం, శుభసమయం చూసుకుని మెడలో ధరింపచేయండి. ప్రతి బుధవారం లేదా సోమవారం ఆ రుద్రాక్షలను శుభ్రమైన నీటితో కడిగి ఆవుపాలలో కొద్దిసేపు ఉంచి తర్వాత శుభ్రమైన నీటితో కడిగి వాటిని తిరిగి ధరిస్తూ ఉండాలి. దీనివల్ల దైవానుగ్రహం కలిగి మీ పిల్లలకు చక్కని చదువు వస్తుంది.

Admin

Recent Posts